Maha Shivaratri: పల్నాడు పల్లెల్లో మహా శివరాత్రి అంగరంగవైభవంగా జరుగుతోంది. కోటప్పకొండ(Kotappakonda) తిరుణాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచింది. ప్రభుత్వం(AP Govt) స్టేట్ ఫెస్టివల్(State Festival)గా ప్రకటించింది. కోటప్పకొండ లో మహా శివరాత్రి కి ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కడా లేని విధంగా కోటప్పకొండ లో విద్యుత్ ప్రభలు కొలువుదీరుతాయి. డెబ్భై అడుగుల ఎత్తుతో నిర్మాణం చేసి విద్యుత్ బల్బులు అమర్చి ప్రభలను కొండ తరలిస్తారు భక్తులు. ఇక్కడ ప్రభలు కట్టడానికి ఓ ప్రత్యేకత ఉంది.
త్రికూటం( మూడు కొండలు)పై శివుడు ధ్యానంలో ఉన్నాడంట. గురవాయిపాలెంకు చెందిన ఆనందవల్లి అలియాస్ గొల్లభామ అనే గొర్రెల కాపరి ప్రతి రోజూ స్వామి వారికి పాలను ఆహారంగా అందించేదంట.. అయితే గర్భం దాల్చిన ఆనందవల్లి స్వామి దగ్గరకు వెళ్ళి…. స్వామి నేను కొండ ఎక్కలేకపోతున్నాను. నాతో పాటు కిందికి వస్తే ప్రతి రోజూలాగే పాలు ఆహారంగా ఇస్తాను అందిట. అయితే స్వామి ఒక నిబంధనకు ఒప్పుకుంటే కిందికి వస్తాను అని చెప్పాడంట. నువ్వు వెనుదిరిగి చూడకుండా ముందు కొండ దిగు… నీ వెనుకే నేను వస్తాను. ఎప్పుడైతే నువు వెనుదిరిగి చూస్తావో అప్పుడు శిల అయిపోతాను అని చెప్పినాడంట. షరతుకు ఒప్పుకున్న ఆనంద వల్లి ముందు నడుస్తుంటే స్వామి వెనుక వస్తున్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద,పెద్ద శబ్దాలు రావటంతో భయపడిన ఆనందవల్లి వెనుదిరిగి చూసిందంట.. అంతే స్వామి బ్రహ్మ శిఖరంపై శిల అయినాడంట… అందుకే ముందు ఆనందవల్లిని దర్శించుకున్న తర్వాతే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అయితే భక్తులు స్వామి వద్దకు వెళ్ళి కొండ దిగి రావాలని వేడుకున్నారంట. అప్పుడు ఎప్పుడైతే నా కొండ కు కోటి ప్రభలు వస్తాయో అప్పుడు కొండ దిగి వస్తానని చెప్పాడంట. ఈ నేపధ్యంలోనే పల్నాడు సంస్కృతి లో ప్రభలు భాగస్వామ్యం అయ్యాయి.
తమ గ్రామాలు పచ్చని పాడిపంటలతో తల తూగాలంటే కోటయ్య కొండకు ప్రభ కట్టుకొని వెళ్ళాలని ఇక్కడ ప్రజలు భావిస్తారు. అంతే కాదు తామ కోరిన కోర్కే తీర్చితే ప్రభ కట్టుకొని కొండకు వస్తామని మ్రొక్కుకుంటారు. గత డెభ్భె ఏళ్ళ నుండి క్రమం తప్పకుండా కొన్ని గ్రామాలు ప్రభలను కొండకు తరలిస్తున్నాయి. పురుషోత్త పట్నం, కావూరు, అవిశాయ పాలెం, మద్దిరాల, ఉప్పలపాడు, గోవిందాపురం వంటి గ్రామాలు ప్రతి ఏటా కొండకు ప్రభలను తరలిస్తాయి.
ఈ మధ్య కాలంలో నర్సరావుపేట చుట్టుపక్కల ఫ్లై ఓవర్ల నిర్మాణం, హెచ్ టి విద్యుత్ లైన్ల నిర్మాణంతో కొన్ని గ్రామాలు చిన్న, చిన్న ప్రభలతోనే కొండకు వస్తున్నాయి. ఒక్కో ప్రభ ఏర్పాటు చేయటానికి పదిహేను లక్షలు రూపాయలు ఖర్చవుతుంది. అదే విధంగా ఒకే ఇంటి పేరు గల కుటుంబాలు ప్రత్యేకంగా కొండకు ప్రభలతో వస్తాయి. ఇంటి కింత లేకపోతే ఎకరాని కింత అని చందా వేసుకొని ప్రభను నిర్మిస్తారు. ఒక్కో ప్రభను తరలించడానికి వంద మంది అవసరం అవుతారు. ఒకప్పుడు ఎద్దులతో నే ప్రభలను తరలించే ప్రజలు ప్రస్తుతం ట్రాక్టర్ల సాయంతో ప్రభలను కొండకు తరలిస్తున్నారు. మహా శివరాత్రి రోజు రాత్రి జాగారానికి ప్రత్యేకత చోటుచేసుకుంది. ఈ ప్రభలపై ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ భక్తులు జాగారం పూర్తి చేస్తారు. కోటప్పకొండ కోటి వేల్పుల అండ అని భావించే భక్తులు ఈ ఏడాది మార్చి ఒకటో తేదిన జరగనున్న తిరుణాళ్ళకు సిద్దమవుతున్నారు.
Reporter: T Nagaraju, Tv9 telugu, Guntur
Also Read: