మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని.. మాఘ పూర్ణిమగా భక్తులు జరుపుకుంటున్నారు. బ్రహ్మా ముహుర్తం సమయంలో పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి సూర్యభగవానుడికి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఈ పౌర్ణమి తిథికి అధిపతి చంద్రుడు. పిల్లల సుఖ సంతోషాల కోసం చాలామంది పౌర్ణమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 04 శనివారం రాత్రి 09:29 గంటలకు ప్రారంభమైంది. ఈరోజు అంటే ఆదివారం రాత్రి 11:58 గంటలకు ముగుస్తుంది. ఈరోజు రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో సహా నాలుగు శుభ యోగాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చేసే స్నానం, పూజలు, మంత్రాలు పఠించడం, దానధర్మాలు అత్యంత ఫలవంతమని.. పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం. దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
జ్యోతిష్యం ప్రకారం.. లక్ష్మిదేవి, చంద్రుని ఆశీస్సులతో అదృష్టం వెల్లివిరుస్తుంది. సంపదను పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. లక్ష్మీ దేవికి ఎనిమిది రూపాలు ఉన్నాయి.. ఈ రూపాలను అష్టలక్ష్మి అని పిలుస్తారు. అష్టలక్ష్మి అనుగ్రహం పొందిన వ్యక్తి, పురోగతిని ఎవరూ అడ్డుకోలేరు. అదే సమయంలో లక్ష్మీ దేవి ఆగ్రహిస్తే.. ఆ వ్యక్తి సంపద, కీర్తి, ఐశ్వర్యం అన్నీ శూన్యం. మాఘ పూర్ణిమ రోజున అష్టలక్ష్మీదేవి ఆగ్రహం పొందకుండా ఉండడానికి కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఈరోజు ఎవరైనా పొరపాటున వీటిని చేస్తే.. లక్ష్మీ దేవి ఆగ్రహంతో ఇబ్బందులు తలెత్తుతాయి.
మాఘ పూర్ణిమ రోజున ఏమి చేయకూడదంటే..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)