Lunar Eclips 2022: శత్రు, రోగ విముక్తి కోసం చంద్ర గ్రహణ సమయంలో ఈ మంత్రాలను పఠించండి..

|

May 13, 2022 | 3:32 PM

గ్రహణ కాలంలో ఏదైనా మంత్రాన్ని పఠించడం అత్యధిక ప్రభావం కలుగుతుంది. అందుకే చాలా మంది గ్రహణ కాలంలో ప్రత్యేకంగా మంత్రాలు పఠిస్తారు. ఈ సమయంలో పఠించే సిద్ధ మంత్రాలు  జీవితానికి చాలా ఫలవంతమైనవిగా నిరూపించారు

Lunar Eclips 2022: శత్రు, రోగ విముక్తి కోసం చంద్ర గ్రహణ సమయంలో ఈ మంత్రాలను పఠించండి..
Lunar Eclipse
Follow us on

Lunar Eclips 2022: మే 16న, 2022 వ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం 2022 బుద్ధ పూర్ణిమ రోజున ఏర్పడబోతోంది. గ్రహణ కాలాన్ని గ్రంథాలలో అశుభంగా పరిగణించానరు. సూర్య, చంద్రగ్రహణం సమయాల్లో సూర్యుడు, చంద్రుడు రాహువు , కేతువులచే పీడించబడతారని.. అప్పుడు వారి శక్తి బలహీనపడుతుందని నమ్మకం. ఈ సమయంలో దేవతలైన సూర్య చంద్రులు ఇబ్బంది పడతారు కనుక గ్రహణం ముగిసే వరకు పూజలు నిషేధించబడ్డాయి. అయితే గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపించడం ద్వారా గ్రహ పీడలు తొలగుతాయని నమ్మకం.

జ్యోతిష్కుడు డాక్టర్ అరవింద్ మిశ్రా చెప్పిన ప్రకారం.. గ్రహణ కాలంలో ఏదైనా మంత్రాన్ని పఠించడం అత్యధిక ప్రభావం కలుగుతుంది. అందుకే చాలా మంది గ్రహణ కాలంలో ప్రత్యేకంగా మంత్రాలు పఠిస్తారు. ఈ సమయంలో పఠించే సిద్ధ మంత్రాలు  జీవితానికి చాలా ఫలవంతమైనవిగా నిరూపించారు. మీరు కూడా ఏదైనా సమస్యకు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, చంద్రగ్రహణం సమయంలో మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు ఆ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. భారత కాలమానం ప్రకారం, చంద్రగ్రహణం మే 16, సోమవారం ఉదయం 07:59 గంటలకు ప్రారంభమై 10:23 గంటలకు ముగుస్తుంది.

ఏ సమస్యకు ఏ విధమైన మంత్రాన్ని పఠించాలంటే..

ఇవి కూడా చదవండి

ఆర్ధిక సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. మీరు ఆర్థిక సమస్యలను తొలగించుకోవాలనుకుంటే, ‘ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహా’ అనే మంత్రాన్ని జపించండి. ఉద్యోగంలో ప్రమోషన్ ,  వ్యాపారంలో లాభం కోసం,’ఓం శ్రీం శ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద-ప్రసీద శ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః’అనే మంత్రాన్ని జపించండి. ప్రసంగ సాఫల్యం కోసం, ‘ఓం హ్రీం దుం దుర్గాయై: నమః’ అనే మంత్రాన్ని జపించండి. మీరు ఈ మంత్రాలను జపమాలతో జంపించాల్సి ఉంటుంది. మీ సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది.

అనారోగ్యం సమస్యల నుంచి 

కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లయితే, అతను గ్రహణ కాలంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. బాధితునకు మంత్రం పఠించడం కుదరకపోతే, మరొకరు అతని కోసం జపం చేయవచ్చు. రుద్రాక్ష మాలతో ఈ మంత్రాన్ని జపం చేయాల్సి ఉంటుంది. అనంతరం ప్రతిరోజూ ఒక జపమాలతో ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా క్రమంగా బాధలు కూడా తగ్గుముఖం పడతాయి.

శత్రు పీడలను తొలగించుకోవడానికి

మీరు శత్రువులను జయించాలనుకుంటే.. మా బగ్లాముఖి ‘ఓం హ్రీం బాగ్లాముఖి దేవై సర్వ దూషణం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ్-కీల బుద్ధిం వినాశయ్ హ్లీం ఓం నమః’ అనే మంత్రాన్ని జపించండి. మీపై ఏదైనా కోర్టులో కేసు నడుస్తున్నట్లయితే, విజయం కోసం ‘ఓం హీం బగళాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ్ బుద్ధి వినాశయ్ హ్లీం ఓం స్వాహా’ అనే మంత్రాన్ని జపించండి.

కోరికను నెరవేర్చుకోవడానికి: 

ఏ జపమైనా పూర్తి భక్తి, విశ్వాసంతో చేయాలని జ్యోతిష్య పండితులు డాక్టర్ అరవింద్ మిశ్రా చెబుతున్నారు. మీ విజయం, మీ వైఫల్యం రెండూ విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి. మనస్సు , విశ్వాసం లేకుండా చేసే పని ఎప్పుడూ విజయం సాధించదు. అందుచేత, మీరు మంత్రం జరిపిస్తూ… మీ ఇష్టదేవతను స్మరించుకోండి. మీ కోరికను తీర్చమని ప్రార్థించండి.  పూర్తి భక్తితో మంత్రాన్ని జపించండి. గ్రహణ కాలం తర్వాత ఆ మాలను పూజగదిలో ఉంచి.. ఆ జపమాలతో క్రమం తప్పకుండా మంత్రాన్ని జపించండి. మీరు శుభ ఫలితాలను పొందుతారు. అయితే  ఏ మంత్రాన్ని దుర్వినియోగం చేయవద్దు. అలా మంత్రాన్ని దుర్వినియోగం చేస్తే, మీరు ఖచ్చితంగా దుష్ప్రభావాన్ని కూడా భరించాల్సి వస్తుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..