Andhra Pradesh: కృష్ణా జిల్లాలో ఆస్తికర పరిణామం.. ఆమె కలలోకి వచ్చిన పరమేశ్వరుడు.. చెప్పిన చోట తవ్వి చూడగా..

|

Sep 23, 2021 | 10:49 AM

Andhra Pradesh: కృష్ణా జిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు కలలో కలో దేవుడు కనిపించిన చెప్పిన విషయం....

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో ఆస్తికర పరిణామం.. ఆమె కలలోకి వచ్చిన పరమేశ్వరుడు.. చెప్పిన చోట తవ్వి చూడగా..
Lord Shiva Linga
Follow us on

Andhra Pradesh: కృష్ణా జిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు కలలో కలో దేవుడు కనిపించిన చెప్పిన విషయం.. వాస్తవరూపం దాల్చింది. దాంతో గ్రామ ప్రజలంతా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కన గ్రామాల ప్రజలు.. ఆ వింత ఘటనను చూసేందుకు మూలలంక గ్రామానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మూల లంక గ్రామంలో శివాలయం నిర్మాణం కోసం 30 సంవత్సరాల క్రితమే కొంత భూమిని కేటాయించారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. అయితే, ఖాళీగా ఉన్న ఆ భూమిలో గ్రామ సచివాలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు, అధికారులు తీర్మానం చేశారు. అంతేకాదు.. సచివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పనులు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ ఆ స్థలం దగ్గరికి వెళ్లి కొలతలు వేసి, ప్లానింగ్, మార్కింగ్ ఇచ్చారు. కానీ, ఇంతలోనే అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది.

అదే గ్రామానికి చెందిన మహిళ కొక్కిలిగడ్డ లక్ష్మి( మంగమ్మ).. సదరు భూమికి వద్దకు వచ్చి సచివాలయ నిర్మాణ పనులు ఆపాల్సిందిగా కోరింది. ఎందుకని ప్రశ్నించగా.. షాకింగ్ విషయం చెప్పింది. తనకు కలలో భగవంతుడు కనిపించాడని, ఆ భూమిలో శివలింగం విగ్రహం ఉన్నట్లు చెప్పాడని తెలిపింది. నమ్మకం లేకపోతే.. ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే విషయం మీకే తెలుస్తుందంటూ సదరు మహిళ చెప్పింది. అయితే, లక్ష్మి చెప్పినట్లుగా అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో సదరు స్థలంలో తవ్వకాలు చేపట్టారు. రెండు అడుగుల లోతు తవ్వగా శివలింగం బయటపడింది. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వెంటనే విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కన గ్రామాల ప్రజలు.. భూమి నుంచి బయటపడిన శివలింగాన్ని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలిస్తున్నారు. శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు.

Also read:

Cyber Crime: యాప్ డౌన్లోడ్ చేయించి డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేశారు.. ఎలా ముంచేశారంటే..!

Chia Seeds: చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు..! చియా విత్తనాలతో 5 ప్రయోజనాలు..! వీడియో

Viral Video: రోడ్డుపై లేడీ డ్యాన్స్‌ హల్‌చల్‌.. డబ్బులిస్తే ఓకే.. లేదంటే రచ్చ.. రచ్చే.! వీడియో