Shanidev: శని దేవుడి అనుగ్రహం ఉండాలంటే.. ఈ పనులు చేయాలి

|

Feb 28, 2024 | 12:20 PM

సాధారణంగా శని అనగానే చాలా మంది భయపడుతుంటారు కానీ శని దేవుడి అసలు స్వభావం తెలుసుకుంటే భయం అనేది ఉండదు. జ్యోతిషశాస్త్ర పుస్తకాలలో న్యాయాన్ని ప్రేమించే గ్రహంగా శనిని వర్ణిస్తారు. మనిషికి అతని కర్మలను బట్టి మంచి, చెడు ఫలితాలను ఇస్తుంది. అందుకే ఆయనను న్యాయ దేవుడు లేదా..

Shanidev: శని దేవుడి అనుగ్రహం ఉండాలంటే.. ఈ పనులు చేయాలి
Shanidev
Follow us on

జాతకంలో శని ప్రత్యేక పాత్రను పోషిస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థికం మొదలు ఆరోగ్యం వరకు అన్ని రకాల పరిస్థితులపై శని ప్రభావం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇక శని భగవానుడి కృప ఉండాలంటే కచ్చితంగా కొన్ని రకాల పనులకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ నివారణ చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా శని అనగానే చాలా మంది భయపడుతుంటారు కానీ శని దేవుడి అసలు స్వభావం తెలుసుకుంటే భయం అనేది ఉండదు. జ్యోతిషశాస్త్ర పుస్తకాలలో న్యాయాన్ని ప్రేమించే గ్రహంగా శనిని వర్ణిస్తారు. మనిషికి అతని కర్మలను బట్టి మంచి, చెడు ఫలితాలను ఇస్తుంది. అందుకే ఆయనను న్యాయ దేవుడు లేదా కర్మ ఫలాలను ఇచ్చేవాడుగా పిలుస్తుంటారు. ఇక శనిదేవుడి అనుగ్రహం మనపై ఉండాలంటే కచ్చితంగా ఈ పనులు చేయాలి. అవేంటంటే..

* మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఎప్పుడూ వేధించకూడదని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. బలహీనులకు అండగా నిలిచే వారికి శని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది.

* ప్రకృతి వికాసానికి సహకరించే వారికి శని దేవుడు విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తాడని చెబుతారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుతూ ప్రకృతి, పశువులకు సేవ చేయడం ద్వారా శని అనుగ్రహం పొందొచ్చు.

* మీ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల నాశనానికి ఉపయోగించకూడదు. ఇలాంటి వారిపై శని దుష్ఫ్రభావాన్ని చూపుతాడు. వీలైనంత వరకు ఇతరులకు సేవ చేసేందుకు మీ సంపాదను ఉపయోగించాలి.

* ఇతరుల హక్కులను హరించాలని చూసే వారిపై శని కఠినంగా వ్యవహరిస్తారని వాస్తు పండితులు చెబుతున్నారు.

* అధికారం, పదవులు, డబ్బు గురించి గర్వపడే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. డబ్బు అహంకారం ఉన్న వారికి శని తగిన బుద్ధి చెప్తాడని అంటున్నారు.

* కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే వ్యక్తులపై శని ఆశీస్సులు ఉంటాయని పండితులు చెబుతున్నారు. సాయం కోసం ఎదురు చూసే వారికి సహాయం అందిస్తే శని దేవుడు వారి పట్ల సానుకూలంగా ఉంటారని చెబుతున్నారు.

* నీటి దానం చేసినా శని దేవుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వేసవిలో జలదానం చేయడం ఎంతో ఉత్తమమని చెబుతున్నారు.

* మత్తు పదార్థాలు, మద్యం సేవించే వారిపై శని భగవానుడి ప్రకోపం ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే శనివారం రోజు మాంసాహారం సేవించినా శని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఏమాత్రం శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..