“ప్రసన్న వదనం ధ్యాయేత్..సర్వ విఘ్నోపశాంతయే..! ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా.. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలనుకుంటాం. అందుకోసం విఘ్నేశ్వరుడికి తొలిపూజ చేస్తాం. వినాయక చవితికి ఏటా పత్రితో పూజిస్తాం.
గణేషుడి పత్రి పూజలో అనేక ఆధ్యాత్మిక, శాస్త్రీయత కూడా దాగివున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే..వినాయక పూజ అంటే ప్రకృతి ఆరాధనే! ప్రకృతితో మమేకం కావడమే!! ప్రకృతి దేవాయ నమః.. గణపతి అంటే ప్రకృతి దేవుడే! ప్రకృతి ఆరాధనే స్వభావం కల్గిన దైవం విఘ్నేశ్వరుడు! వినాయక చవితి సందర్భంగా..ఆ గణపతి పూజలోని కొలువైన ప్రకృతి ఆరాధన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వినాయక చవితి వచ్చేసింది. తెలుగు లోగిళ్లలో సంబరాలు తెచ్చింది. అంతేకాదు ప్రకృతితో మమేకమై జీవించమని సందేశాన్ని ఇస్తోంది.
గణపతి ఆరాధన అంటే ప్రకృతి ఆరాధనే.. ఈరోజు కృత్రిమ రసాయనాలతో చేసే విగ్రహాలకు గుడ్‌బై చెప్పి..వరసిద్ధి వినాయక వ్రతంలో చెప్పినట్లుగా..పుట్టమన్ను లేదా చెరువు మట్టితో చేసిన ప్రతిమను పూజించాలి. అదే అనాదిగా వస్తున్న భారతీయ ఆచారం అని గుర్తించాలి. అలాగే ఔషధ గుణాలతో కూడిన ధవనం, మారేడు, మామిడి, దేవదారు, విష్ణుక్రాంత తదితర 21 పత్రాలతో పూజించడం వినాయకునికి ప్రీతికరం! మరీ ముఖ్యంగా గరిక పూజ గణపతికి మరింత ఇష్టం! వంద యజ్ఞాలకు మించిన ఫలాన్ని ఒక్క గరిక పోచ ఇస్తుందని పురాణ వచనం!
విఘ్నేశ్వరునికి మణులు మాణిక్యాలు అక్కర్లేదు. వైభవోపేతమైన అలంకరణలకు ఆయన దూరం! వట్టి మట్టితో విగ్రహం చేసి.. ఎర్రని కుంకుమ నుదుట దిద్దండి చాలు..పార్వతీ తనయుకు పరవశిస్తాడు.
లంబోదరడికి ఇష్టమైనవి ఏమిటి?
బియ్యం పిండితో చేసే ఉండ్రాళ్లు, కుడుములు. ఈ ప్రసాదాలన్నీ ప్రకృతికి ప్రతీకలే. ధాన్యం, బియ్యం పిండి, 21 రకాల ఔషధ పత్రాలు, గరిక వంటి ప్రకృతి పదార్థాలతోనే విఘ్నాధిపతికి అర్చన సాగుతుంది. పండుగలలో తొలి పండుగైన వినాయక చవితి వేళ మన జీవితాల్లో విజయాల కోసం అంతా నిశ్చల భక్తి శ్రద్ధలతో ఆ ప్రకృతి దైవమైన గణపతిని మనసారా ఆరాధిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. లంబోదరుడు మనకు అన్నింటా విజయాన్ని అందించాలని కోరుకుందాం.
ఇవి కూడా చదవండి:Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వస్తున్న పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!
Ford India shut down: కార్ల తయారీ సంస్థ ఫోర్ట్ మోటార్ సంచలన నిర్ణయం.. భారత్‌లో ప్లాంట్ల మూసివేత