జ్యోతిర్లింగ రూపంలో పూజించబడుతున్న గజాసురుడు.. మానవులకు ముక్తిని ప్రసాదించే ఆలయం ఎక్కడంటే..

|

Jun 22, 2024 | 2:57 PM

గజాసురుడు జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివలింగమే వారణాసిలోని కృతివశేశ్వర దేవాలయం. ఈ ఆలయం శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం.. మహా మృత్యుంజయ దేవాలయం మధ్య హర్తీరత్ వద్ద ఉంది. ఈ ఆలయాన్ని దర్శించినంత మాత్రాన జనన మరణ బంధాల నుంచి విముక్తి లభిస్తుందని, భక్తులు మోక్షాన్ని పొందుతారని నమ్మకం. ఇది పురాతన కాలం నాటి కాశీలో అతిపెద్ద ఆలయం. మహాశివరాత్రి రోజున కృత్తివాసేశ్వర మహాదేవుడి దర్శనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

జ్యోతిర్లింగ రూపంలో పూజించబడుతున్న గజాసురుడు.. మానవులకు ముక్తిని ప్రసాదించే ఆలయం ఎక్కడంటే..
Krittivaseshwar Mahadev Temple Varanasi
Follow us on

భారత దేశంలో 12 జ్యోతిర్లింగాలు శివ భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. అయితే శివుడి వరంతో మరొక శివలింగం కూడా జ్యోతిర్లింగంగా పూజలను అందుకుంటున్న సంగతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. అవును రాక్షస రాజు గజాసురుడికి శివుడు ఇచ్చిన వరానికి చిహ్నం ఈ జ్యోతిర్లింగం. ఇక్కడ గజాసురుడిని జ్యోతిర్లింగ రూపంలో పూజిస్తారు. వారణాసిలోని 14 ముఖ్యమైన దేవాలయాలలో ఇది ఒకటిగా పరిగణింపబడుతున్నది. ఈ జ్యోతిర్లింగ ప్రతిష్టకు సంబంధించిన కథ శివపురాణంలో ఉంది.

కృత్తివాసేశ్వర దేవాలయం

గజాసురుడు జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివలింగమే వారణాసిలోని కృతివశేశ్వర దేవాలయం. ఈ ఆలయం శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం.. మహా మృత్యుంజయ దేవాలయం మధ్య హర్తీరత్ వద్ద ఉంది. ఈ ఆలయాన్ని దర్శించినంత మాత్రాన జనన మరణ బంధాల నుంచి విముక్తి లభిస్తుందని, భక్తులు మోక్షాన్ని పొందుతారని నమ్మకం. ఇది పురాతన కాలం నాటి కాశీలో అతిపెద్ద ఆలయం. మహాశివరాత్రి రోజున కృత్తివాసేశ్వర మహాదేవుడి దర్శనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఇవి కూడా చదవండి

గజాసురుడు ఎవరు?

గజాసురుడు మహిషాసురుని కుమారుడు. తండ్రి వలెనే రాక్షస గుణం,,, ప్రతీకారం, నిరంకుశ భావాలను కలిగి ఉన్నాడు. మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించిన తర్వాత తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రహ్మ దేవుడి కోసం తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గజాసురుడు చాలా కాలం తపస్సు చేస్తూనే ఉన్నాడు అయితే చివరకు గజాసురుడి కటోర తపస్సుకుని మెచ్చి ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు గజాసురుడు బ్రహ్మదేవుని స్తుతించి శక్తిమంతుడు, అజేయుడు అనే వరం పొందాడు. గజాసురుడు బ్రహ్మ దేవుడి నుండి కోరుకున్న వరం పొందిన తరువాత చాలా సంతోషించాడు. అతను మూడు లోకాలలోనూ భీభత్సం సృష్టించడం ప్రారంభించాడు.

శివపురాణం ఏం చెబుతోంది?

శివపురాణంలోని శ్రీ రుద్ర సంహితలో ఐదవ విభాగంలోని 57వ అధ్యాయంలో గజాసురుడిని తపస్సు చేయడం.. సంహరణ, కృత్తివాసేశ్వర మహాదేవ ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగం గురించి వివరణ ఉంది. శివపురాణం ప్రకారం బ్రహ్మదేవుడి నుంచి కోరుకున్న వరం పొందిన తరువాత గజాసురుడు ముల్లోకాల్లోనూ భీభత్సం సృష్టించాడు. ఒకసారి శివునికి ఇష్టమైన నగరమైన కాశీకి వెళ్లి అక్కడ అందరినీ వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలందరూ కలిసి శివుని వద్దకు వెళ్లి ముకుళిత హస్తాలతో ప్రార్ధించి శివయ్యను రక్షించమని సహాయం కోరారు.

దేవతలకు సహాయం చేయడానికి శివుడు తన త్రిశూలాన్ని తీసుకొని గజాసురుడిని సంహరించడానికి బయలుదేరాడు. శివుడు, రాక్షస రాజు గజాసురుని మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తన ఖడ్గంతో శివునిపై విరుచుకుపడ్డాడు. శివుడు త్రిశూలంతో అతనిపై దాడి చేయడం ప్రారంభించాడు. చివరకు దేవాధిదేవుడు శివుడు త్రిశూలంతో గజాసురుడిపై దాడి చేసి త్రిశూలం సహాయంతో పైకి లేపాడు. తనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని తెలుసుకున్న రాక్షస రాజు గజాసురుడు శివుడిని పూజించడం ప్రారంభించాడు.

వరం ఇచ్చిన శివుడు

శివుని పూజిస్తూ గజాసురుడు “ప్రభూ! నీ పవిత్రమైన త్రిశూలంతో నా దేహాన్ని తాకుతున్నావు కాబట్టి నా శరీర చర్మాన్ని నువ్వు ధరించాలని కోరుకుంటున్నాను. ప్రభూ మీరు ఎల్లప్పుడూ నా చర్మపు కవచాన్ని ధరించండి. ఈ రోజు నుండి మీరు ‘కృత్తివాస’ అనే పేరుతో పిలవబడాలి అని కోరుకున్నాడు. పరమశివుడు సంతోషంతో రాక్షసరాజు గజాసురునికి కోరుకున్న వరాన్ని ఇచ్చాడు. అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన కాశీ నగరంలో గజాసురుడికి మోక్షం లభిస్తుందని వరాన్ని ఇచ్చాడు. నీ దేహము ఇక్కడ నా జ్యోతిర్లింగముగా ప్రతిష్ఠింపబడి కృతివాసేశ్వరుని పేరుతో జగద్విఖ్యాతి పొంతుంది. ఈ జ్యోతిర్లింగాన్ని చూడడం ద్వారా మానవులు ముక్తిని, మోక్షాన్ని పొందుతారని వరం ఇచ్చాడు భోలాశంకరుడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.