
East Godavari: తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి రుద్రాక్ష మహాయగం ఘనంగా జరిగింది. ప్రకృతి వైపరీత్యలు, ఎటు వంటి దోషాలు లేకుండా లోక సంరక్షణయార్థం కోటి రుద్రాక్ష మహాయాగం గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. మూడురోజులుగా చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి మహాయాగం నిర్వహిస్తున్నారు. రోజుకు 35 లక్షల చెప్పున కోటి ఐదు లక్షల రుద్రాక్షలతో స్వామివారికి పూజాదికార్యక్రమాలను నిర్వహించారు.
కోటి రుద్రాక్ష మహాయగంలో మూడవ రోజు చివరి రోజు. మహాయాగంలో అఘోరాలు పాల్గొన్నారు. ఉజ్జయిని అఖండ పీఠాధిపతులు రాజేశ్నాధ్ ఠాగూర్ తో కూడిన 18 మంది అఘోరాలు పూజలో పాల్గొని.. శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వంటి ప్రకృతి వైపరీత్యాలనుంచి దేశం కోలుకోవాలని.. దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ యాగం చేసినట్టు యాగ నిర్వహికులు నాగమల్లేశ్వ సిద్ధాంతి చెప్పారు.
Also Read: మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్.. మాకు ఇష్టమైన చిరుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు..