Telangana: వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించిన ప్రభుత్వం

|

Dec 19, 2022 | 2:33 PM

కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కోర మీసాల మల్లన్నకు కోటి స్వర్ణ కిరీటం బహుకరించింది తెలంగాణ ప్రభుత్వం.  

Telangana: వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించిన ప్రభుత్వం
Komuravelli Mallikarjuna Swamy
Follow us on

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న కల్యాణం వైభవంగా జరిగింది. పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద మల్లికార్జునుడు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ కల్యాణం జరిగింది. ఆలయ సంప్రదాయం మేరకు వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు, వధువుల మేడలాదేవి, కేతమ్మదేవీ తరఫున మహదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలతోపాటు కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. ప్రభుత్వం తరపున మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు పట్టువస్త్రాలతో పాటు బంగారు కీరిటాన్ని ఆలయ అర్చకులకు అందించారు. మల్లన్న ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 30కోట్లు కేటాయించారన్నారు హరీష్‌రావు. కొండగట్టు అంజన్న ఆలయానికి 100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

ఉత్తర తెలంగాణలో జాతర అంటే.. మల్లన్న జాతరేనన్న మంత్రి.. వచ్చే ఏడాది మేడమ్మకు, ఖేతమ్మకు సైతం బంగారు కిరీటాలను చేయిస్తామని ప్రకటించారు. రెండు రోజులపాటు జరుగనున్న కల్యాణోత్సవంలో ఇవాళ స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కల్యాణం వైభవంగా జరగడం.. స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..