Success Mantra: మనిషి జీవితంలో సత్యానికి ఉండే విలువ.. అబద్ధం వలన కలిగే నష్టం ఏమిటో తెలుసా..

|

Aug 23, 2022 | 7:24 PM

ఒక్కసారి మీరు అబద్ధాలు చెబుతారనే భావం ఏర్పడితే..  తర్వాత మీరు ఎంత నిజం చెప్పినా ప్రజలు నమ్మరు. జీవితంలో సత్యానికి ఉండే విలువ, అబద్ధాల వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Success Mantra: మనిషి జీవితంలో సత్యానికి ఉండే విలువ.. అబద్ధం వలన కలిగే నష్టం ఏమిటో తెలుసా..
Great Motivational Thoughts
Follow us on

Success Mantra: సాధారణంగా జీవితంలో ఒక వ్యక్తి  ఖచ్చితంగా ఏదొక విషయంలో అబద్ధాలను ఆశ్రయిస్తాడు. కారణం ఏదైనా అబద్ధాలు చెబుతాడు. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మరి కొన్నిసార్లు ఇతరులను రక్షించడానికి అబద్ధాలను ఆశ్రయిస్తాడు. అయితే అబద్ధం  జీవితం కాదు. ఏదొక రోజు ఆ అబద్ధం బయటపడి.. మెడకు చుట్టుకుంటుంది. ఒక్కసారి మీరు అబద్ధాలు చెబుతారనే భావం ఏర్పడితే..  తర్వాత మీరు ఎంత నిజం చెప్పినా ప్రజలు నమ్మరు. జీవితంలో సత్యానికి ఉండే విలువ, అబద్ధాల వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం.

  1. అబద్ధం చెప్పే వ్యక్తికి అతను ఆ అబద్ధానికి ఎంత బాధ్యత వహించాలో అతనికి తెలియదు. ఎందుకంటే అతను ఒక అబద్ధాన్ని దాచడానికి మరికొన్ని అబద్ధాలు చెప్పవలసి ఉంటుంది.
  2. జీవితంలో అబద్ధం లో నిజాయతీ అంటూ ఉండదు. అంటే, అబద్ధం ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
  3. నిజం చెప్పులు ధరించే సమయానికి, అబద్ధం సగం ప్రపంచాన్ని ప్రయాణించిందని అబద్ధాల గురించి ఒక సామెత ప్రచారం. నిజం కంటే అబద్ధం  వేగంగా వ్యాప్తి చెందుతుంది.
  4. జీవితంలో ఎవరితోనైనా అబద్ధంతో బంధం మొదలైతే, ఆ సంబంధం ఎక్కువ కాలం కొనసాగడం చాలా కష్టం.
  5. ఇవి కూడా చదవండి
  6. ఒక వ్యక్తి తన జీవితంలో నీడ, అద్దం వంటి స్నేహితులను ఎంచుకోవాలి. ఎందుకంటే నీడ మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)