Success Tips: దానం విశిష్టత.. కలియుగంలో దాన ధర్మాలు ఎందుకు చేయాలంటే..

|

Oct 10, 2022 | 2:36 PM

ఆకలి, అనాధలకు, దుఃఖితులు, రోగులు, బలహీనులు మొదలగు వారందరికీ అన్నవస్త్రాలు, ఔషధాలు ఏ రూపంలో సేవ చేసినా అన్నీ దాన ధర్మాల కిందకే వస్తాయి. జీవితంలో ధనదానం, దైవదానం, రక్తదానం, భూదానం, అవయవదానం ఇలా అన్ని రకాల దానాలు ఎప్పుడు, ఎవరు, ఎందుకు చేయాలో వివరంగా తెలుసుకుందాం.

Success Tips: దానం విశిష్టత.. కలియుగంలో దాన ధర్మాలు ఎందుకు చేయాలంటే..
Success Mantra On Donation
Follow us on

కలియుగంలో దాన ధర్మం పాపం నుండి విముక్తికి, పుణ్యాన్ని సాధించడానికి ఉత్తమమైన మాధ్యమంగా వర్ణించబడింది. దానం చేసే విషయంలో ఒక వ్యక్తి ఎప్పుడూ సమయం కోసం వేచి ఉండకూడదు. జీవితంలో ఏ వ్యక్తికైనా సహాయం చేయడానికి విరాళం ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు ఎందుకంటే.. దానం చేయడం వలన స్వర్గం సిద్ధిస్తుందని పురాణాల చెబుతున్నాయి. ప్రస్తుతం కాలంలో ధర్మవర్తనమే ఉత్తమమని పెద్దలు చెప్తారు. ఆకలి, అనాధలకు, దుఃఖితులు, రోగులు, బలహీనులు మొదలగు వారందరికీ అన్న.. వస్త్రాలు, ఔషధాలు ఏ రూపంలో సేవ చేసినా అన్నీ దాన ధర్మాల కిందకే వస్తాయి. జీవితంలో ధనదానం, దైవదానం, రక్తదానం, భూదానం, అవయవదానం ఇలా అన్ని రకాల దానాలు ఎప్పుడు, ఎవరు, ఎందుకు చేయాలో వివరంగా తెలుసుకుందాం.

  1. ఎదుటువారు కష్టంలో ఉన్న సమయంలో ఏదీ ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా చేసే దానాన్ని ధర్మ దానం అంటారు.
  2. జీవితంలో ఆవు పాలు, తోట పువ్వులు, జ్ఞానం, బావి నీరు వంటివి దానం చేయడం వలన సంపద మొదలైనవి పెరుగుతాయి. అయితే దానం గుణం లేని చోట ఇవన్నీ వర్ధంగా మారతాయి.
  3. పగటిపూట వెలిగించిన దీపం, సముద్రంలో కురిసిన వర్షం, తృప్తి చెందిన వ్యక్తికి ఆహారం అందించడం ఎలా పనికిరాదో.. అలాగే ధనవంతుడికి దానధర్మాలు చేయడం కూడా పనికిరాదు.
  4. శాస్త్రాల ప్రకారం, మానవుడు దాన ధర్మం ద్వారానే స్వర్గాన్ని పొందుతాడు, దాన ధర్మం ద్వారానే సుఖాన్ని పొందుతాడు. ఇహలోకంలోను, పరలోకంలోను దానధర్మం మనిషిని పూజనీయుడిని చేస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎవరి కష్టాన్ని అయినా తెలుసుకుని చేసే దానం ఉత్తమమని, ఎవరైనా పిలిచి ఇచ్చే దానం మధ్యస్థమని, ఎవరైనా అడిగిన తర్వాత ఇచ్చే దానం తక్కువని, సేవకు ప్రతిగా ఇచ్చే దానం ఫలించదని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)