Lakshmi Devi Puja: సిరిసంపదలు కురిపించే లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే.. వీటిని సమర్పించండి

లక్ష్మీ దేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో పురాణాల్లో వెల్లడించారు. భక్తులు భక్తితో లక్ష్మిదేవికి ఏది సమర్పించినా లక్ష్మిదేవి ప్రసన్నురాలవుతుందని.. అయితే కొన్ని నైవేద్యాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవని, వాటిని ప్రసాదంగా సమర్పిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని విశ్వాసం.  పూజ సమయంలో లక్ష్మీదేవికి మఖానా సమర్పించాలి. నీటిలో పెరిగే మఖానాను చాలా పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవికి మఖనాన్ని సమర్పించడం ద్వారా త్వరగా సంతోషిస్తుంది.

Lakshmi Devi Puja: సిరిసంపదలు కురిపించే లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే.. వీటిని సమర్పించండి
Lakshmi Devi Puja

Updated on: Dec 16, 2023 | 8:28 PM

లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు పూర్తి ఆచారాలతో పూజలు చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే తమ జీవితమే మారిపోతుందని విశ్వాసం. అదే సమయంలో లక్ష్మీ దేవికి ఎవరిపైన అయినా కోపం వస్తే.. వారి జీవితంలో అన్నీ కష్టాలే అని ముఖ్యంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని విశ్వాసం. లక్ష్మీ దేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో పురాణాల్లో వెల్లడించారు. భక్తులు భక్తితో లక్ష్మిదేవికి ఏది సమర్పించినా లక్ష్మిదేవి ప్రసన్నురాలవుతుందని.. అయితే కొన్ని నైవేద్యాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవని, వాటిని ప్రసాదంగా సమర్పిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని విశ్వాసం.

మఖానా: పూజ సమయంలో లక్ష్మీదేవికి మఖానా సమర్పించాలి. నీటిలో పెరిగే మఖానాను చాలా పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవికి మఖనాన్ని సమర్పించడం ద్వారా త్వరగా సంతోషిస్తుంది. తన భక్తుల కోరికలను తీరుస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున పూజలో మఖానా సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

పాయసం: మత విశ్వాసాల ప్రకారం చంద్రుడిని లక్ష్మీ దేవి సోదరుడిగా భావిస్తారు. అదే సమయంలో పాలతో చేసిన పదార్ధాలు కూడా చంద్రునితో సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాయసాన్ని సమర్పించడానికి ఇదే కారణం.

ఇవి కూడా చదవండి

పండ్లు, స్వీట్లు: లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి పండ్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ సమర్పించడం ద్వారా ప్రసన్నం అవుతుంది. అమ్మవారి ఆశీస్సులు కుటుంబం మొత్తానికి ఉంటాయి.

తమలపాకు తాంబూలం: లక్ష్మిదేవికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. పూజ పూర్తయిన తర్వాత  కుటుంబం మొత్తం లక్ష్మీ దేవికి తాంబూలాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వలన లక్ష్మిదేవి సంతసించి కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉండాలని దీవిస్తుందని విశ్వాసం

కొబ్బరి కాయ: ఇంట్లో ఏదైనా పూజ సమయంలో కొబ్బరికాయను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ఇష్టమైన పండు. అందుచేత లక్ష్మీదేవికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు