నవగ్రహాల అనుగ్రహం లభించాలంటే వీటిని దానం చేయాల్సిందే..! అప్పుడే శుభపరిణామాలు..

| Edited By: Anil kumar poka

Nov 15, 2021 | 1:10 PM

Nine Planets: జీవితంతో ముడిపడి ఉన్న నవగ్రహాల అనుగ్రహం పొందడానికి జ్యోతిష్య శాస్త్రంలో అన్ని రకాల పరిహారాలను చెప్పారు. పూజలు, మంత్రోచ్ఛారణలతో పాటు

నవగ్రహాల అనుగ్రహం లభించాలంటే వీటిని దానం చేయాల్సిందే..! అప్పుడే శుభపరిణామాలు..
Nine Planets
Follow us on

Nine Planets: జీవితంతో ముడిపడి ఉన్న నవగ్రహాల అనుగ్రహం పొందడానికి జ్యోతిష్య శాస్త్రంలో అన్ని రకాల పరిహారాలను చెప్పారు. పూజలు, మంత్రోచ్ఛారణలతో పాటు గ్రహాల కోసం చేసే ప్రత్యేక దానాల గురించి కూడా ప్రస్తావించారు. సనాతన సంప్రదాయంలో దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక నిర్దిష్ట గ్రహం కోసం చేసే దానం శుభాలను అందించడమే కాకుండా పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఒక నిర్దిష్ట గ్రహం పీడలను ఎలా తొలగించుకోవాలో అందుకోసం వేటిని దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సూర్య గ్రహం మీ జాతకంలో అశుభ ఫలితాలను చూపిస్తుంటే ఇలా చేయాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం సమర్పించాలి. ఎవరికైనా బెల్లం, గోధుమలు, ఎరుపు వస్త్రం, రాగి మొదలైన వాటిని దానం చేయాలి.

2. చంద్రగ్రహం అశుభాలు తొలగి ఐశ్వర్యం పొందడానికి తెల్లని వస్త్రాలు, పాలు, పెరుగు, నెయ్యి, అన్నం, కర్పూరం మొదలైన వాటిని సాయంత్రం పూట పేదవారికి దానం చేయాలి.

3. అంగారకుడి అశుభం తొలగిపోయి శుభం కలగాలంటే సూర్యోదయం నుంచి రెండు గంటల తర్వాత బెల్లం, పప్పు, కుంకుమ, ఎర్రచందనం మొదలైన వాటిని ఎర్రటి వస్త్రంలో పెట్టి దానం చేయాలి.

4. బుధ గ్రహం దోశాల నుంచి విముక్తి కావాలంటే ఇలా చేయాలి. బుధవారం నాడు సూర్యోదయం తర్వాత ఒక ఆకుపచ్చ వస్త్రంలో ఆకుపచ్చ పండ్లను దానం చేయాలి.

5. బృహస్పతి అనుగ్రహం పొందడానికి పసుపు రంగు పండ్లు, ఆవు నెయ్యి, పసుపు, శనగపప్పు, కుంకుమపువ్వు మొదలైన వాటిని సాయంత్రం పసుపు వస్త్రంలో ఉంచి కొంత దక్షిణతో పేద బ్రాహ్మణుడికి దానం చేయాలి.

6. శుక్ర గ్రహం అనుగ్రహం పొందాలంటే సూర్యోదయ సమయంలో జొన్న, దూది, పెరుగు, సుగంధ ద్రవ్యాలు, తెల్లని వస్త్రాలు, అలంకరణ వస్తువులు, బియ్యం, పంచదార మొదలైన వాటిని దానం చేయాలి.

7. శని గ్రహాం అనుగ్రహం పొందాలంటే మధ్యాహ్న వేళ నల్ల గుడ్డలో తేయాకు, ఉసిరి పప్పు, నల్ల నువ్వులు, ఆవాల నూనె, ఇనుము మొదలైన వాటిని దానం చేయాలి. చలికాలంలో నిరుపేదలకు నల్ల దుప్పటి దానం చేయడం వల్ల శని గ్రహ శుభ ఫలితాలు కలుగుతాయి.

8. రాహు గ్రహం అనుగ్రహం పొందాలంటే ఒక పేద వ్యక్తికి రాత్రిపూట ఆవాలు, బార్లీ, నలుపు రంగు వస్త్రం, దుప్పటి మొదలైన వాటిని దానం చేయాలి.

9. కేతు గ్రహం అనుగ్రహం పొందాలంటే దుప్పటి, నల్ల నువ్వులు మొదలైన వాటిని పేదవాడికి దానం చేయాలి.

10. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగిందని గమనించండి..

NZ vs AUS, T20 World Cup 2021 Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం..

Eyebrows: వయసు పెరిగే కొద్ది కనుబొమ్మలపై ఈ తేడాలు గమనించారా..! అసలు నిజం తెలుసుకోండి..

Backache: వెన్నునొప్పితో బాధపడుతున్నారా..! ఒక్కసారి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..