Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?
శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్‌లో వేచి చూస్తున్నారు. మండల పూజలు ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో స్వాములు తరలి వస్తున్నారు. దీంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెన్ కోర్ నిర్వహిస్తుంది.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాది సంఖ్యలో తరలిరావడంతో అయ్యప్ప నామస్మరణతో శబరి మారుమోగిపోతుంది. కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. దర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుండి పంబ వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. ఇక క్యూలైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలదారులు ఉన్నారు. మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రోజూ సగటున 65 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తుల రద్దీని ముందే ఊహించిన ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ వారికోసం సహాయక చర్యలను చేపట్టింది. భక్తులను క్యూ లైన్ లో వెళ్లే విధంగా సిబ్బంది చూస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్‌లో వేచి చూస్తున్నారు.
అదేవిధంగా కాలినడకన వెళ్లే భక్తులకు అత్యవసర సాయం కోసం మెడికల్ క్లినిక్ లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కాలినడకన వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సాయం చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా కమిటీ దర్శనాన్ని కల్పిస్తోంది. అయినా భక్తులు తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈనెల పూర్తయ్యే వరకు భక్తుల తాకిడి అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక రైళ్లు..
మరోవైపు హోటల్స్‌లో నాసిరకం భోజనంపై భక్తుల ఫిర్యాదులు చేశారు. దీంతో నాసిరకం భోజనం అమ్ముతున్న హోటల్స్‌కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తుల కోసం 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబరు 6వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..