Vastu Tips
వాస్తుశాస్త్రంలో ఇంటికి సంబంధించిన విషయాలను క్లుప్తంగా వివరించారు. ఇంటికి సానుకూలు, ప్రతికూల శక్తులు ఉంటాయని వాస్తుశాస్త్రంలో పేర్కొన్నారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక పద్దతులను వివరించారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. సానుకూల శక్తిని ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడమే కాదు..ఇంట్లో ఆరోగ్యం, ఆనందం కూడా ఉంటుంది. అందుకే ఇంట్లో సరైన వాస్తు అనేది చాలా ముఖ్యం.
పేదరికాన్ని తరిమికొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ సంపదలు,శాంతి నెలకొనాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అందుకోసం ఇంటిగోడలు పగలకొట్టాల్సిన అవసరం లేదు..ఇల్లు మారాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది.
ఇంట్లో ఈ వస్తువులను ఉంచండి:
- నెమలి ఈక: నెమలిఈక చూడటానికి అందంగా కనిపిస్తుంది. ఇంట్లో నెమలిఈకలను ఉంచడం శుభప్రదమని చెబుతోంది వాస్తు శాస్త్రం. వాస్తుప్రకారం నెమలి ఈక శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. నెమలి ఈకను ఇంటికి ఆగ్నేయ దిశలో లేదా సురక్షితమైన ప్రదేశంలోఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో డబ్బును దాచే ప్రాంతంలో మూడు నెమలి ఈకలను ఉంచాలి.
- తాబేలు: లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కష్టాలు, సమస్యలు దూరమవుతాయి. తాబేలును ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో తాబేలు ఉంచితే జీవితంలో చాలా అభివృద్ధిని చూడవచ్చు. ఇంట్లో తాబేలు పెట్టుకోవాలని వాస్తుశాస్ర్తంలో చెప్పబడింది.
- లక్ష్మీదేవి చిత్రపటం: కమలం పువ్వుపై కూర్చుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుకుఎలాంటి కొరత ఉండదు. లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్యదిశలో ఉంచాలి.
- ఏనుగు విగ్రహం: వాస్తు ప్రకారం మీ ఇంట్లో లోహపు ఏనుగు విగ్రహం ఉంచడం శుభప్రదం. అంతేకాదు ఏనుగు బొమ్మను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీరు నివసించే ప్రాంతంలో ఏనుగు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి. ఏనుగు తొండం కిందికి వంగేలా ఉండే విగ్రహాన్ని తీసుకోండి.
- శంఖం: హిందువులు శంఖానికి గొప్పప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రోజూ శంఖం ఊదడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. నారాయణుడు చేతిలోశంఖం పట్టుకుని ఉంటాడు. లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం. ఇంట్లో శంఖాన్ని పెట్టడం వల్ల డబ్బుకు లోటు ఉండదు.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..