Sri Mallamamba Devi Ammavari Jathara: మల్లమాంబ అమ్మవారి జాతర. గ్రామస్తులంతా వేడుకగా జరుపుకునే పండుగ. ఊరి చివర పంట పొలాల మధ్య ఈ అమ్మవారికి గుడి కట్టించి.. రెండేళ్లకు ఒకసారి ఈ జాతర నిర్వహిస్తారు. గ్రామంలోని పురుషులంతా వెదురు కర్రలను చేతిలో పట్టుకొని.. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటారు. ఈ జాతరలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా కర్రలతో కొట్టుకోవడమే వెదుళ్ళ సమరం ప్రత్యేకత. చూడటానికి ఇదో కర్రల యుద్ధంగా కనిపించినా.. ఈజాతర నిర్వహించుకోవడం వెనుక మాత్రం పెద్ద కథ ఉంది.
విశాఖ జిల్లా రాంబిల్లి మండలం దివిలి గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. కర్రల యుద్ధం కారణంగా దిమిలి గ్రామం వార్తల్లోకి ఎక్కలేదు. స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నేతలకు పుట్టినిల్లుగా కూడా ఈ గ్రామం చాలా ఫేమస్ అయింది. మూడు వందల ఏళ్ల క్రితం దిమిలి గ్రామాన్ని దివ్వెలుగా పిలిచేవారు. గ్రామానికి చెందిన భాగవతుల వంశీయుల ఆడపడుచును మరాఠీ దొంగల ముఠా వేధిస్తుంటే మల్లమాంబ వాళ్లతో పోరాడి ప్రాణాలు వదిలినట్లుగా ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. అదే టైమ్‌లో గ్రామస్తులంతా కలిసి ఆ దొంగలను మట్టుబెట్టారని స్థానికులు చెబుతుంటారు.
మల్లమాంబ గ్రామస్తులకు కలలో కనిపించి తాను తనువు చాలించిన విషయాన్ని చెప్పడం వల్లే ఆమెకు గుడి కట్టించి.. రెండేళ్లకు ఒకసారి ఇలా జాతర నిర్వహిస్తున్నారు. మరాఠీ దొంగల ముఠాను మట్టుబెట్టేందుకు గ్రామస్తులంతా ఏకమై వెదురు కర్రలతో సిద్ధమవుతారు. గ్రామానికి చెందిన వాళ్లు విదేశాల్లో ఉన్నప్పటికి ఈ జాతరను చూసేందుకు వస్తుంటారు. మరో వారంలో ఇక్కడే బురద పండగను జరుపుకుంటారు. కాలువలోని బురదను వేప కొమ్మలతో గ్రామస్తులంతా పూసుకుంటారు. మరాఠీ దండపై గ్రామస్తుల పోరాటానికి ప్రతీకగా, వీర వనిత తనువు చాలించినందుకు ఆచారంగా ఈ పండుగ నిర్వహిస్తున్నారు.
Read Also… Gujarat non-veg Row: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంపై మాంసాహారుల ఫైర్.. కారణం తెలిస్తే షాక్!