భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. కొండకోనల్లో మాత్రమే కాదు.. అనేక ప్రాంతాల్లో దేవుళ్ళ, దేవతల ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఆ రాష్ట్ర సంస్కృతిని చూపిస్తాయి. ప్రతి ఆలయానికి దాని సొంత ప్రత్యేకత ఉంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలోని చాలా దేవాలయాలు.. ప్రత్యేక నిర్మాణశైలి కారణంగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని కాంచీపురంలోని కైలాసనాథర్ ఆలయం అటువంటి వాస్తుశిల్పానికి గొప్ప ఉదాహరణ.
కాంచీపురం హిందువులకు పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ నగరాన్ని దేవాలయాల నగరం అని కూడా అంటారు. కైలాసనాథర్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం శివుడు, విష్ణువు, దేవి, సూర్యుడు, గణేశుడు, కార్తికేయులను పూజించడానికి నిర్మించబడింది. కాంచీపురంలోని ఈ దేవాలయాల్లో కాంచీపురం రత్నంగా పిలువబడే కైలాష్ నాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయం సుమారు 1,300 సంవత్సరాల పురాతనమైనది. ఈ నగరాన్ని సందర్శించడానికి వచ్చే ప్రజలు ఈ ఆలయ నిర్మాణాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు.
కైలాసనాథ్ ఆలయ నిర్మాణం వాస్తుశిల్పానికి చక్కటి ఉదాహరణ. ఈ ఆలయ ప్రత్యేకత ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని రాళ్ల ముక్కలను కలిపి నిర్మించారని భావిస్తున్నారు. ప్రధాన ఆలయ సముదాయంలో 58 చిన్న ఆలయాలను నిర్మించడం ఈ ఆలయానికి సంబంధించిన అతి పెద్ద విశేషం. అంతేకాదు ఆలయ ప్రవేశద్వారం వద్ద గోడపై 8 యాత్రా స్థలాలు ఉన్నాయి. ఇందులో రెండు ప్రవేశ ద్వారం ఎడమ వైపున ఉండగా, 6 కుడి వైపున ఉన్నాయి. ఈ ఆలయ గర్భగుడిపై ద్రవిడ శిల్పకళలో ఒక విమానాన్ని నిర్మించారు. గర్భగుడిలో గ్రానైట్‌తో చేసిన అద్భుతమైన, భారీ శివలింగాన్ని ప్రతిష్టించారు. గర్భగుడి చుట్టూ గోడలపై శివలింగోద్భవ, ఊర్ధ్వ తాండవ మూర్తి, త్రిపురాంతక, హరిహర వంటి రూపాలు చెక్కబడి ఉన్నాయి.
కాంచీపురంలోని కాకైలాష్నాథ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. అందువల్ల భక్తులు ప్రతి సోమవారం ఇక్కడకు వస్తారు. దీనితో పాటు శ్రావణ మాసం, మహా శివరాత్రి పర్వదినాల్లో హిందువులు భారీ సంఖ్యలో కనిపిస్తారు. అంతేకాదు అనేక ఇతర పండుగల సమయంలో జాతరలా భక్తుల సందడి నెలకొంటుంది. అయితే ఆధ్యాత్మిక దృష్టితో పాటు, కళ, పురావస్తుశాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు కూడా ఈ ఆలయానికి వస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు