Jyeshtha Purnima: జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రుడిని, లక్ష్మీదేవిని ఇలా పూజించండి.. ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతాయి..

|

Jun 10, 2024 | 3:31 PM

జ్యేష్ఠ పూర్ణిమ రోజున గంగా నదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయాలి. ఈ రోజున లక్ష్మీ దేవిని, విష్ణువును పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ ఉండదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున గంగా స్నానం, దానధర్మాలు, ఉపవాసం, చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. జ్యేష్ఠ మాసం పౌర్ణమి తిథి జూన్ 21, 2024 ఉదయం 6:01 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తేదీ జూన్ 22, 2024 ఉదయం 5:07 గంటలకు ముగుస్తుంది

Jyeshtha Purnima: జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రుడిని, లక్ష్మీదేవిని ఇలా పూజించండి.. ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతాయి..
Jyeshtha Purnima 2024
Follow us on

హిందూ మతంలో జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మతపరమైన దృక్కోణంలో చూస్తే ఈ రోజు చాలా పవిత్రమైనది. ముఖ్యమైనది. ఎందుకంటే ఈ తేదీన చంద్రుడు పూర్ణ చంద్రుడి రూపంలో కనిపిస్తాడు. ఈ రోజున గంగాస్నానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ రోజున స్నానం చేసిన తరువాత బ్రాహ్మణుడు చంద్రునికి సంబంధించిన తెల్లని వస్త్రం, చక్కెర, బియ్యం, పెరుగు లేదా వెండి వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడి జీవితంలో ఆనందం కొనసాగుతుందని నమ్ముతారు.

జ్యేష్ఠ పూర్ణిమ రోజున గంగా నదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయాలి. ఈ రోజున లక్ష్మీ దేవిని, విష్ణువును పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ ఉండదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున గంగా స్నానం, దానధర్మాలు, ఉపవాసం, చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.

జ్యేష్ఠ పూర్ణిమ శుభ సమయం 2024

జ్యేష్ఠ మాసం పౌర్ణమి తిథి జూన్ 21, 2024 ఉదయం 6:01 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తేదీ జూన్ 22, 2024 ఉదయం 5:07 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో జూన్ 21వ తేదీ శుక్రవారం రోజున జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకుంటారు. ఉపవాసం పూజ చేస్తారు. అలాగే పూర్ణిమ సందర్భంగా జూన్ 22వ తేదీ శనివారం స్నానమాచరించి దానం చేస్తారు.

ఇవి కూడా చదవండి

జ్యేష్ఠ పూర్ణిమ కోసం నివారణలు
ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజున చంద్రోదయం తర్వాత పాత్రలో పాలు నింపి అందులో పంచదార, పచ్చి బియ్యం కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ సమయంలో చంద్రుడికి సంబంధించిన మంత్రాన్ని జపించాలి. ఇది ఆర్థిక సమస్యలను తొలగిస్తుందని.. ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని నమ్ముతారు.

ఈ పరిహారంతో లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందండి

జ్యేష్ఠ పూర్ణిమ రోజున 11 గవ్వలను శుభ్రమైన ఎర్రటి గుడ్డలో చుట్టి పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచండి. దీని తరువాత లక్ష్మీ దేవిని పూజించి.. పసుపు లేదా కుంకుమతో తిలకం దిద్దండి. దీని తరువాత ఈ గవ్వలను దుస్తులతో పాటు సురక్షితంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని.. ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు.

కోరిక నెరవేరాలంటే: మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే.. అది నెరవేరాలని మీరు కోరుకుంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజున చంద్రుడిని పూజించి, పాలలో తేనె, చందనం కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.

రావి చెట్టుకు నీళ్ళు సమర్పించండి: జ్యేష్ఠ పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి రావి చెట్టుకు నీరు, స్వీట్లు సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

పాయసం సమర్పించండి: జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీ దేవికి బియ్యం తో చేసిన లేదా మఖానా తో చేసిన పాయసాన్ని సమర్పించండి. ఇది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది. ఈ నైవేద్యాన్ని సమర్పించడం వల్ల లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నురాలవుతుందని నమ్మకం. అంతేకాదు ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. అటువంటి పరిస్థితిలో సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఈ పాయసాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.

జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ 5 పనులు చేయకండి

పౌర్ణమి రోజున తామసిక పదార్థాలు తినకూడదు.
పౌర్ణమి రోజున జుట్టు, గోర్లు కత్తిరించకూడదు.
పౌర్ణమి రోజున మీ జీవిత భాగస్వామితో వివాదాలు లేదా వాదించవద్దు.
పౌర్ణమి రోజున జూదం, బెట్టింగ్ మొదలైన తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
పౌర్ణమి రోజున తల్లిని, పెద్దలను అవమానించకండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు