హిందూ మతంలో ప్రతి నెలలో వచ్చే అమావాస్య తిథి రోజున చేసే పూజ, స్నానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అమావాస్య రోజున పూర్వీకులు తమ వారసులను ఆశీర్వదించడానికి భూమికి వస్తారని నమ్మకం. ఈ రోజున స్నానం చేయడం, దానం చేయడం , తర్పణం ఇవ్వడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే పూర్వీకులకు తర్పణం సమర్పించడం ద్వారా.. వారు సంతోషంగా ఉంటారు. తమ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో జీవించమని ఆశీర్వదిస్తారు. జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజున కూడా స్నానం దానం చేయడం ద్వారా పూర్వీకుల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం జ్యేష్ట అమావాస్య జూలై 5 లేదా జూలై 6 న అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ రోజున ఖచ్చితమైన తేదీ గురించి తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట మాసంలోని అమావాస్య తేదీ జూలై 5 ఉదయం 04:57 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రోజున సూర్యోదయం ఉదయం 05:29 గంటలకు ఉంటుంది.
అమావాస్య తిథి జూలై 6వ తేదీ తెల్లవారుజామున 4:26 గంటలకు ముగుస్తుంది.ఆ రోజు ఉదయం 05:29 గంటలకు సూర్యోదయం అవుతుంది. కనుక ఉదయ తిథి, సూర్యోదయ సమయం ప్రకారం జ్యేష్ట అమావాస్య తేదీ జూలై 5 న ఉంటుంది.. జూలై 6 న అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు ముగుస్తుంది. కనుక జూలై 5వ తేదీ శుక్రవారం జ్యేష్ట అమావాస్య.
సర్వార్థ సిద్ధి యోగం జ్యేష్ట అమావాస్య రోజున ఏర్పడుతోంది.. అంటే ఇది జూలై 6న ఏర్పడుతుంది. పంచాంగం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగం ఒక శుభ యోగంగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే పనులన్నీ విజయవంతమవుతాయి.
అంతే కాదు జ్యేష్ట అమావాస్య రోజున ధృవ యోగం, శివ వాస యోగం కూడా ఏర్పడుతున్నాయి. ధృవ యోగ సమయంలో చేసే పూజ చాలా ఫలప్రదం. ఈ యోగంలో స్నానం చేయడం, దానం చేయడం, తర్పణం ఇవ్వడం వల్ల దోషరహిత ఫలితాలు లభిస్తాయి. శివ వాస యోగంలో కైలాస పర్వతంపై నివసించే శివ పార్వతులను పూజించడం ద్వారా ప్రతి కోరిక తీరుతుంది.
జ్యేష్ట అమావాస్య రోజున ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయండి. ఆ తర్వాత శక్తి మేరకు ఆహారం, బట్టలు, పండ్లు, ఏదైనా పాత్రను దానం చేయండి. ఇలా చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి. సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది.
జ్యేష్ట అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీ పూర్వీకులను స్మరించుకోండి. తరువాత పూర్వీకులకు నీరు, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులు మొదలైనవి సమర్పించాలి. తర్పణం సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు