Srivari Brahmotsavam: ఈసారైనా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ ఇలా చేస్తారా.. జనసేన నేత సూటి ప్రశ్న

|

Sep 20, 2022 | 7:23 PM

పవన్ కళ్యాణ్ ను వీకెండ్ పొలిటీషన్ అంటున్నారు.. వీళ్లు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతుంది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్కరికి ఉద్యోగం కల్పించారా? అంటూ ప్రశ్నించారు తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్. 

Srivari Brahmotsavam: ఈసారైనా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ ఇలా చేస్తారా.. జనసేన నేత సూటి ప్రశ్న
Janasena On Cm Jagan
Follow us on

Srivari Brahmotsavam: అధికార పార్టీ నేతలు, మంత్రుల మాటల తీరుపై జనసేన పార్టీ నేత తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ఏడాది అయినా బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం సతీసమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారా? లేదా?  అసలు సీఎం తన భార్య భారతిని తిరుమలకు ఎందుకు తీసుకురావడం లేదో ప్రజలకు మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి రోజా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ  శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎంతో మంది ముఖ్యమంత్రులు సతీసమేతంగా వచ్చి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారని.. మరి ఇప్పుడు మన సీఎం జగన్  తన భార్య భారతీరెడ్డిని ఎందుకు తీసుకురావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అసలు భారతి రానంటుందా? లేదా ముఖ్యమంత్రి రానివ్వడం లేదా? అనే దానిపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. పట్టు వస్త్రాల్లో మెరిసిపోతూ.. జగన్, భారతీ రెడ్డి దంపతులు తిరుమల క్షేత్రానికి వస్తే చూడాలని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అధినాయకుడు.. అలాంటి పార్టీలో ఉన్న నాని, రోజా లాంటివాళ్ళు  తమ అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. మాజీ మంత్రి పేర్ని.. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై ఎంత తీవ్ర విమర్శలు చేసినా.. అతనికి మళ్ళీ మంత్రి పదవి రాదన్నారు. పవన్ కళ్యాణ్ ను వీకెండ్ పొలిటీషన్ అంటున్నారు.. వీళ్లు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతుంది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్కరికి ఉద్యోగం కల్పించారా? అంటూ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ తన యాత్ర గురించి చాలా స్పష్టంగా చెప్పారు. తమ అధినేత రోడ్లు మీదకు వస్తే లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కుతారు. అందుకు తగ్గ ఏర్పాట్లు పక్కాగా చేయాలి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే తన యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారని పేర్కొన్నారు. అంతేకాదు.. తమ అధినాయకుడు పవన్ యాత్రను మొదలైతే వైసీపీ నాయకులకు నిద్రలేని రాత్రులు గడపడం ఖాయం అంటూ కిరణ్ రాయల్ జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి

పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా సినిమాల్లో నటించేటప్పుడు విదేశాల్లో పర్యటించారు. ఇప్పడు రాజకీయాల్లో కూడా విదేశాల్లోనే పర్యటిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే.. మీరు విదేశాల్లో పర్యటించడం అనుకుంటున్నారు. అసలు మంత్రి రోజా నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.

అసలు వైసీపీ నేతలు తమ పార్టీ అధ్యక్షుడు సింహం.. సింగిల్ గా వస్తాడు అంటున్నారు. మరి వైఎస్ఆర్ 2004లో ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేదు? టీఆర్ఎస్, వామపక్షాలతో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు? ప్రజలకు సమాధానం చెప్పండన్నారు జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..