Jatmai Temple: భారత దేశంలో ప్రకృతి అందాల నడుమ ఎన్నో దేవాలయాలు నిర్మాణాలు జరిగాయి. కొండకోనల్లో కొన్ని చోట్ల దేవుళ్ళు స్వయంభువుగా వెలిశారు. మన దేశాన్ని ఏలిన రాజులు, పెద్దలు, ఆలయాలను నిర్మించి దేవుడిపై తమకున్న భక్తిని చాటుకున్నారు. అటువంటి ఆలయాల్లో ఒకటి ఛత్తీస్ గడ్ జిల్లాలో ఉంది.
రాయిపూర్ కి 85 కిమీ దూరం లో గరియబంద్ లో కొలువైన మాత జాట్మయి. పచ్చని వాతావరణం..పై నుండి జాలువారి నీటి సెలయేర్లు మద్య తో ఈ దేవి ఆలయం ఎంతో రమణీయంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ జాట్మయి దేవి దర్శనం కనుల విందు కలిగిస్తుంది.
మాతా జాట్మైకి అంకితమైన ఈ ఆలయం గ్రానైట్తో నిర్మించబడింది. ఈ అలయ ప్రవేశద్వారం వద్ద అందమైన చిత్రాలు ఉన్నాయి. ఈ .దేవాలయం చాలా పురాతనమైంది. ఎంతో విశిష్టత కలిగిన ఆలయం. దేవాలయ నిర్మాణ శైలి,కట్టడాలు చూస్తే ఈ ఆలయ నిర్మాణం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందని తెలుస్తోంది. భక్తులకు అమ్మవారి దర్శనమే కాదు.. చుట్టూ ప్రక్కల ఉన్న వాతావరణం ఆనందాన్ని ,ఆహ్లాదాన్ని ఇస్తుంది .ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రి పండుగ సందర్భంగా ఈ పవిత్ర స్థలంలో దీపాలు వెలిగిస్తారు. ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తారు.
Also Read: ల్యాప్ టాప్ మరణించింది అంటూ అంత్యక్రియలు ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి.. వీడియో వైరల్