Diwali 2024: దీపావళి రోజున శనేశ్వరుడిని ఇలా పూజిస్తే.. అంతులేని ధనం మీ సొంతం!

|

Oct 17, 2024 | 12:58 PM

దీపావళి పండుగ కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా దీపావళి ఎప్పుడు వస్తుందా అని పిల్లలు చాలా ఆశ పడతారు. ఎందుకంటే బాణాసంచా కాల్చవచ్చని.. కమ్మనైన పిండి వంటలు తినవచ్చని అనుకుంటారు. నిజానికి దీపావళి పండుగ రోజున లక్ష్మీ దేవిని ఎంతో భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు. తమపై తల్లి కరుణ చూపాలని వేడుకుంటారు. మరికొందరు ఎంతో ఆర్భాటంగా లక్ష్మీ దేవి పూజ నిర్వహిస్తారు. అయితే దీపావళి రోజు లక్ష్మీ దేవినే కాకుండా శని దేవుడుని..

Diwali 2024: దీపావళి రోజున శనేశ్వరుడిని ఇలా పూజిస్తే.. అంతులేని ధనం మీ సొంతం!
Diwali 2024
Follow us on

దీపావళి పండుగ కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా దీపావళి ఎప్పుడు వస్తుందా అని పిల్లలు చాలా ఆశ పడతారు. ఎందుకంటే బాణాసంచా కాల్చవచ్చని.. కమ్మనైన పిండి వంటలు తినవచ్చని అనుకుంటారు. నిజానికి దీపావళి పండుగ రోజున లక్ష్మీ దేవిని ఎంతో భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు. తమపై తల్లి కరుణ చూపాలని వేడుకుంటారు. మరికొందరు ఎంతో ఆర్భాటంగా లక్ష్మీ దేవి పూజ నిర్వహిస్తారు. అయితే దీపావళి రోజు లక్ష్మీ దేవినే కాకుండా శని దేవుడుని కూడా పూజిస్తే.. మీ కోరికలన్నీ తరతాయి. శని దేవుడు అంటే చాలా మందికి భయం. ఎందుకంటే ఏడు సంవత్సరాల వరకు శని శాపం పోదు. ఎవరు తప్పులు చేస్తూ ఉంటారో వారిని శని దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. సాడేసాతి, అర్థాష్టమ, శని ప్రభావం అనే మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఆయా జన్మలో సదరు వ్యక్తి చేసిన కర్మలను బట్టి శని దేవుడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు.

దీపావళి రోజు శని దేవుడికి ప్రత్యేకంగా పూజలు..

శని దేవుడు కరుణిస్తే పేదవాడు కూడా రాజు అయిపోతాడు. అదే విధంగా రాజు కూడా బికారీలా మారిపోతాడు. అంత శక్తి శనేశ్వరుడికి ఉంది. అందుకే మంచి పనులు చేస్తూ, దేవుడి అనుగ్రహం కోసం వేడాలని పండితులు చెబుతూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా దీవాళి రోజున లక్ష్మీ దేవినే కాకుండా శనేశ్వరుడిని పూజించినా మీకు మంచి ఫలితాలు దక్కుతాయి.

అమావాస్య అంటే ఇష్టం..

దీపావళి పండుగను అమావాస్య తిథి రోజున జరుపుతాం. అమావాస్య అంటే శని దేవుడికి ఇష్టం అని చెబుతారు. అందుకే దీపావళి రోజున శని భగవానుడిని మీ శక్తి కొలదీ పూజిస్తే మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. శని గ్రహం అనుగ్రహం కోసం.. కుక్కలు, ఆవులు, కాకులు తినేవి ఏమైనా పెట్టాలి.

ఇవి కూడా చదవండి

తైలాభిషేకం..

దీపావళి రోజున శనికి తైలాభిషేకం చేస్తే.. చాలా సంతోషిస్తాడు. అదే విధంగా హనుమంతుడిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినా కూడా శని దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడని పలు పురాణాలు కూడా చెబుతున్నాయి.

పండుగ రోజు ఇలా చేయండి..

దీపావళి పండుగ రోజున నల్ల చీమలకు పంచదార లేదా బెల్లం ఆహారంగా వేయండి. కష్టాలతో బాధ పడేవారు దీపావళి రోజున ఓ పాత్రలో నూనె పోసి అందులో వాళ్ల ముఖం చూడాలి. ఆ తర్వాత ఈ నూనెను పారుతున్న నీళ్లలో వేయాలి. అనంతరం కాళ్లు, చేతులు కడుక్కుని.. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లాలి. ఇలా చేస్తే.. అపార ధనం, జాబ్‌‌లలో ప్రమోషన్లు దక్కుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)