Indrakeeladri: ఈ నెల 30 నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు.. 3 రోజుల పాటు జరిగే ప్రత్యేక్ష, పరోక్ష సేవలన్నీ రద్దు..

| Edited By: Surya Kala

Aug 22, 2023 | 1:35 PM

మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఈ పవిత్రోత్సము జరగనున్నాయి. ఈ నెలాఖరున 30 నా ప్రారంభం అయ్యి సెప్టెంబర్ 1వ తేదీన ముగుస్తాయి. 29 వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతితో ఉత్సవాలు ప్రారంభం అయ్యి 30 వ తేది తెల్లవారుజామున 3 గంటలకు దుర్గమ్మకు సుప్రభాత సేవ, అనంతరం స్నాపనభిషేకం, నిత్యా అలంకరణ, పవిత్రాల ధారణ జరుగుతుంది

Indrakeeladri: ఈ నెల 30 నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు.. 3 రోజుల పాటు జరిగే ప్రత్యేక్ష, పరోక్ష సేవలన్నీ రద్దు..
Kanaka Durga Temple
Follow us on

లోక కళ్యాణార్ధం, భక్తజన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రిపై వైదిక కమిటీ సూచనలతో ఈ నెల 30 నుండి పవిత్రోత్సములు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్రోత్సములు నేపథ్యంలో 30 నుండి 1 వ తేదీ వరకు ఆలయంలో జరిగే అన్ని ప్రత్యేక్ష పరోక్ష సేవలను నిలిపేశారు ఆలయ అధికారులు. మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఈ పవిత్రోత్సము జరగనున్నాయి. ఈ నెలాఖరున 30 నా ప్రారంభం అయ్యి సెప్టెంబర్ 1వ తేదీన ముగుస్తాయి. 29 వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతితో ఉత్సవాలు ప్రారంభం అయ్యి 30 వ తేది తెల్లవారుజామున 3 గంటలకు దుర్గమ్మకు సుప్రభాత సేవ, అనంతరం స్నాపనభిషేకం, నిత్యా అలంకరణ, పవిత్రాల ధారణ జరుగుతుంది. అనంతరం చండీహోమం యాగా శాల వద్ద 11 గంటలకు గణపతి పూజ, మండపారాధన అగ్నిప్రతిష్టంభన, దేవతారాధన జరుగుతుంది. ఈ మధ్యలోనే 9 గంటల నుండి భక్తులకు దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తారు.

ఇక సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మూలా మంత్ర వాహనములు, వేద పారాయణములు, హారతి, మంత్ర పుష్పము జరుగుతుంది. ఇక 31 కూడా ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మండపారాధన, సర్వప్రాయశ్చిత విధి తాతావ్ దేవతారాధన.. సాయంత్రం 4 గంటల నుండి ఆరు గంటల వరకు మూలా మంత్ర వాహనములు, వేద పారాయణములు, హారతి , మంత్ర పుష్పము యధావిధిగా జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ 10:30 కు పుర్ణాహుతి కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనము కార్యక్రమములతో ముగుస్తుంది. ఈ మూడు రోజుల పాటు అమ్మవారి ఆలయంలో జరిగే ప్రత్యేక్ష, పరోక్ష సేవలన్నీ నిలిపేస్తారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..