Donation Rules: అవసరం అయిన వారికి దానం చేయాలనుకుంటే.. ఈ ముఖ్య నియమాలు తెలుసుకోండి..

|

Dec 14, 2022 | 4:30 PM

ఎవరికైనా ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసినప్పుడు.. అది మనస్సుకు ఆనందాన్నిఇవ్వడమే కాదు.. శుభ ఫలితాలను కూడా ఇస్తుందని ఒక నమ్మకం. అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..

Donation Rules: అవసరం అయిన వారికి దానం చేయాలనుకుంటే.. ఈ ముఖ్య నియమాలు తెలుసుకోండి..
Important Rules Of Donation
Follow us on

సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం.. దానానికి విశిష్ట స్థానం ఉంది. ఏదైనా అవసరం ఉన్న వ్యక్తికి ఏదైనా దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. పేదలకు లేదా అవసరం అయిన వారికీ దానం చేయడం సనాతన సంప్రదాయంలో మాత్రమే కాకుండా అన్ని మతాలలో శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు ఎవరికైనా ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసినప్పుడు.. అది మనస్సుకు ఆనందాన్నిఇవ్వడమే కాదు.. శుభ ఫలితాలను కూడా ఇస్తుందని ఒక నమ్మకం. అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా.. వాటిని విస్మరించడం వలన కష్టలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు దానం చేసే సమయంలో మనం పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

  1. ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల చాలా పుణ్యం లభిస్తుందని నమ్మకం. అయితే ఇలా ఆకలి ఉన్నవారికి దానం చేసేటప్పుడు.. మీరు ఇచ్చే ఆహారం పాచిపోయింది, పాడైపోయింది అవ్వకూడదని గుర్తుంచుకోండి. నిల్వ ఉన్న లేదా చెడిపోయిన ఆహారాన్ని దానం చేయడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని పెద్దలు చెబుతారు.
  2. మీరు ఎవరికైనా ఏదైనా దానం చేస్తే.. సంతోషంగా ..నిండు హృదయంతో..  ఎటువంటి దురాశ లేకుండా చేయండి. స్వచ్ఛమైన హృదయంతో చేసే దానం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఆపన్నులకు సహాయం చేస్తూ..  మీరు అతని పట్ల జాలి కరుణ  చూపిస్తున్నారనే సాకుతో ఎవరికీ దానం చేయకూడదు.
  3. చిరిగిన పుస్తకాలు లేదా గ్రంథాలను ఎవరికీ దానం చేయడానికి ప్రయత్నించకండి. మీరు ఎవరికైనా పుస్తకాలను ఇవ్వాలని భావిస్తే.. కొత్తవి కొనివ్వండి. చిరిగిన పుస్తకాలను దానం చేయడం మంచిది కాదు. ఇలా చేయడం వలన చదువుల దేవి సరస్వతీ దేవి ఆగ్రహానికి గురవుతారని ఒక నమ్మకం. ఫలితంగా పిల్లల చదువుపై చెడు ప్రభావం పడుతుంది.
  4. మీరు విరాళం ఇచ్చే సమయంలో దాని పరిమాణం గురించి ఆలోచించవద్దు. కొన్ని సార్లు చిన్న విరాళం కూడా చాలా ముఖ్యమైంది. విలువైంది కావొచ్చు. చిన్న బిందువులే నదులైనట్లు.. చిన్న చిన్న విరాళాలే గొప్ప సాయం చేయవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. మీరు ఎవరికైనా ఏదైనా దానం చేసినప్పుడు, ఆ వ్యక్తికి న్యూనతాభావం ఏర్పడుతుంది. అతను తనను తాను చిన్నవాడిగా భావించడం ప్రారంభించడం చాలా సార్లు జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు అవసరమైన వ్యక్తికీ దానాన్ని.. రహస్యంగా చేయండి.  తద్వారా సహాయం పొందుతున్న వ్యక్తి ఎలాంటి సంకోచాన్ని కలిగి ఉండడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)