చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త అంతకు మించి గొప్ప ఆర్థికవేత్త. అతను జీవిత తత్వశాస్త్రం తెలిసిన వ్యక్తిగా సుపరిచితుడు. వారు ఏ పరిస్థితినినైనా సరే ముందుగానే అంచనా వేసేవారు దానిని ఎదుర్కోవటానికి వ్యూహాన్ని రచించేవారు. అతను మొత్తం నంద్ వంశాన్ని నాశనం చేసి మౌర్య వంశాన్ని స్థాపించడానికి ఇదే కారణం. ఆచార్య చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన తర్వాత అక్కడ చాలాకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అతడు రాసిన గ్రంథాలలో చాణక్య నీతి ఒకటి. ఇందులో ఆచార్య జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావించారు. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని శాంతింపజేసే నాలుగు మార్గాలను తెలిపారు.
1. ఇంటి పరిశుభ్రత
ఆచార్య చాణక్య ప్రకారం లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించాలనుకుంటే ముందు పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అపరిశుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మిదేవి నిలువదు. ఇళ్లు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు అందులో ఉండే మనుషులు కూడా శుభ్రతను పాటించాలి.
2. డబ్బుతో ఎవరికీ హాని చేయవద్దు
ఎవరికైనా హాని కలిగించడానికి ఎప్పుడు డబ్బును ఉపయోగించవద్దు. డబ్బును ఎల్లప్పుడూ అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలి. ఒక వ్యక్తి తన ఆదాయం నుంచి పేదలకు దానం చేయాలి. ఇది లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. కానీ మీరు డబ్బుతో ఇతరులకు హాని చేస్తే అప్పుడు లక్ష్మి దేవికి కోపం వస్తుంది. ఇంట్లో కడు పేదరికం ఏర్పడుతుంది.
3. తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించకండి
చాణక్య నీతి ప్రకారం.. మోసం లేదా తప్పుడు పనుల ద్వారా సంపాదించిన డబ్బు మీతో ఎప్పుడూ ఉండదు. అలాంటి సంపద కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది. అందుకే కష్టపడి డబ్బు సంపాదించండి మీ సంపాదనతో ఇతరులకు మేలు చేయండి. ఇది మీ డబ్బును వృద్ధి చేస్తుంది.
4. పొదుపు చేయాలి
ఆచార్య చాణక్యుడు నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా వృధాగా ఖర్చు చేయకూడదని చెప్పాడు. డబ్బు దాచుకోవడం అలవాటు చేసుకోవాలన్నాడు. చెడు సమయాలు వచ్చినప్పుడు ఈ పొదుపు డబ్బు మీకు నిజమైన స్నేహితుడిలా నిలుస్తుందని బోధించాడు. అందుకే ప్రతి వ్యక్తి డబ్బు ఆదా చేయడం నేర్చుకోవాలని ఆచార్య చాణక్య చెప్పాడు.