Dreams Facts: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అయితే రాబోయే కష్టాలకు అవే సంకేతాలు!

కలలు మనందరి జీవితంలో ఒక భాగం. ప్రతీ వ్యక్తి నిద్రపోయేటప్పుడు కలలు కనడం సర్వసాధారణం. కొంతమంది ఆ రోజు వారి జీవితంలో...

Dreams Facts: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అయితే రాబోయే కష్టాలకు అవే సంకేతాలు!
Dreams Facts

Updated on: Mar 25, 2022 | 11:51 AM

కలలు మనందరి జీవితంలో ఒక భాగం. ప్రతీ వ్యక్తి నిద్రపోయేటప్పుడు కలలు కనడం సర్వసాధారణం. కొంతమంది ఆ రోజు వారి జీవితంలో జరిగిన సంఘటనలను కలలో చూస్తే.. మరికొందరు సంతోషకరమైన మధురానుభూతులను కలలో చూస్తుంటారు. కొన్నిసార్లు కలలో కనిపించే దృశ్యాలు అర్థవంతంగా కనిపిస్తాయి, మరికొన్నిసార్లు అవి పూర్తిగా అసంబద్ధంగా ఉంటాయి.

ఇదిలా ఉంటే.. కలల గ్రంథం ప్రకారం.. ప్రతీ కలకు ఓ అర్ధం ఉంటుంది. అది మన భవిష్యత్తు పరిస్థితులకు సూచికగా నిలుస్తుంది. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు చాలాసార్లు నిజమవుతాయని పండితులు చెబుతుంటారు. ఈ మేరకు, కలల గ్రంథంలో కలలను రెండింటిగా విభజించారు. కొన్ని పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయని, మరికొన్ని నెగటివ్ ఎనర్జీతో ఉంటాయని పేర్కొన్నారు. మరి మన భవిష్యత్తులో రాబోయే కష్టాలకు సంకేతంగా నిలిచే కలలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీ పాట పాడుతూ కనిపిస్తే..

ఓ స్త్రీ నిద్రిస్తున్నప్పుడు లేదా స్నానం చేస్తున్నప్పుడు కౌగలించుకుని పాట పాడుతూ మీ కలలో కనిపించినట్లయితే.. దాన్ని ఆశుభంగా పరిగణిస్తారు. ఇది భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి లేదా ప్రమాదానికి సంకేతం కావచ్చు.

దెయ్యాన్ని చూస్తే..

నిద్రపోయాక కొందరికి దెయ్యాల కలలు వస్తుంటాయి. మీ మనస్సు క్షోభకు గురవుతోందని.. ఈ కలల అర్ధం. మీరు దేనికో భయపడుతున్నారని.. మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యారని చెబుతున్నాయి. ఇలాంటి సిట్యువేషన్‌లో మీరెప్పుడైనా అనారోగ్యానికి గురి కావచ్చు. లేదా మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు.

అఘోరాలను చూడటం..

మీ కలలో అఘోరాలు కనిపించినట్లయితే.. అది కీడుకు సంకేతం. కలల గ్రంథం ప్రకారం, రాబోయే కాలంలో వచ్చే ఇబ్బందులు, ఆర్ధిక నష్టానికి అది సూచికగా నిలుస్తుంది.

చెట్లను విరగొట్టడం..

మీరు మీ కలలో చెట్టు కొమ్మను విరగొట్టడం చూసినట్లయితే.. భవిష్యత్తులో కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం దెబ్బతింటుందని అర్థం.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మతపరమైన ..జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది.)