హైదరాబాద్ వేదికగా త్వరలో అంతర్జాతీయ భాగవత సదస్సు: చిన్నజీయర్‌స్వామి కీలక ప్రకటన
హైదరాబాద్ వేదికగా త్వరలో అంతర్జాతీయ భాగవత సదస్సును నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. భగవాన్ శ్రీ కృష్ణ తత్వాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని.. అందుకు మనమంతా సిద్ధం కావాలని చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు.

హైదరాబాద్ వేదికగా త్వరలో అంతర్జాతీయ భాగవత సదస్సును నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. భగవాన్ శ్రీ కృష్ణ తత్వాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని.. అందుకు మనమంతా సిద్ధం కావాలని చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెల్లాపూర్ మై హోం త్రిదశ ప్రాంగణంలో కొలువై ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి కళ్యాణోత్సవానికి చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిదండి చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. భగవంతుడి ఆగమనం తర్వాత తెల్లాపూర్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మోహన కృష్ణుడి అనుగ్రహంతో రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ ద్వితీయ వార్షికోత్సవం చాలా వైభవంగా జరుగుతుండడం సంతోషంగా ఉందని చెప్పారు.
మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర రావు కోరిక మేరకు త్వరలో అంతర్జాతీయ భాగవత సదస్సును మై హోం త్రిదశ ఆలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. తమ హక్కును ఎప్పుడు కోల్పోరాదని, దాన్ని సాధించుకునేందుకు నిరంతరం పోరాటం చేయాల్సిందేనని ఇదే భగవంతుడు శ్రీ కృష్ణుడు లోకానికి చెప్పిన తత్వం అని చిన్న జీయర్ స్వామి చెప్పారు. తీవ్రవాదులను అంతమొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న కఠినమైన నిర్ణయం ఎంతో అభినందనీయమని త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు.
