Ayyappa Harivarasanam: అయ్యప్పస్వామి ‘హరివరాసనం’ పాట ఎలా పుట్టింది..?

|

Nov 16, 2021 | 8:15 PM

Ayyappa Harivarasanam: శబరిమల.. ఈ పేరు చెబితేనే భక్తి భావం ఉప్పొంగిపొర్లుతుంది. కార్మిక మాసం వచ్చిదంటే చాలు ఊరూరా.. అయ్యప్ప దీక్షపరులతో, అయ్యప్ప నామస్మరణతో..

Ayyappa Harivarasanam: అయ్యప్పస్వామి ‘హరివరాసనం’ పాట ఎలా పుట్టింది..?
Follow us on

Ayyappa Harivarasanam: శబరిమల.. ఈ పేరు చెబితేనే భక్తి భావం ఉప్పొంగిపొర్లుతుంది. కార్మిక మాసం వచ్చిదంటే చాలు ఊరూరా.. అయ్యప్ప దీక్షపరులతో, అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతుంటుంది. లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు. ఎంతో మంది దేవుళ్లు ఉన్నా.. అయ్యప్పస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేయడం. అయితే స్వామికి ప్రత్యేకమైన పాట ఏమిటంటే పవళింపు పాట. అయ్యప్పస్వామి హరివరాసనం పాట గాయకుడు యెసుదాసు పాడిన పాట. అయ్యప్పస్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు. ఈ పాట ఎంత విన్నా తనివి తీరదు. శబరిమల మణికంఠుని సన్నిదానంలో అయితే తన్మయత్వంలో పులకించుకోక తప్పదు. ఇంతకి ఆ పాట ఎలా పుట్టింది..? ఎవరు రచించారు..? మొదటగా ఎవరు పాడారు..?

శబరిమలలో హరివరాసనం పాడుతున్న సమయంలో ఎటువంటి వాతావరణం ఉంటుంది.? అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడటం ఒక సాంప్రదాయం. ఇదే విధానాన్ని ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ.. ఇతర పూజా కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో ఆలపిస్తుంటారు. ఇందుకు సంబంధించిన అప్పటి వివరాల ప్రకారం.. ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్నికుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట. 1940-50 దశకాల్లో శబరిమలలోని నిర్మానుష కాలంలో వీఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు స్వామి వారి ఆలయ సమీపంలో జీవిస్తుండేవాడట. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఈ హరివరాసనాన్ని పటిస్తుండేవారట. అప్పట్లో ఈశ్వర్ నంభుత్రి అనే తాంత్రి స్వామివారికి పూజలు చేస్తుండే వారని, ఆ తర్వాత గోపాలమీనన్ శబరిమల నుంచి వెళ్లిపోయాక అతను మరణించాడని తెలుసుకుని తీవ్రంగా బాధపడి దుఃఖించిన ఈశ్వర్ నంభుద్రి తాంత్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివారట. అప్పటి నుంచి శబరిమలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది

హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం నిత్య నర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప

శరణ కీర్తనం భక్తమానసం
భరణ లోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప

కళమృదుస్మితం సుందరాననం
కళభకోమలం గాత్రమోహనం
కళభకేసరీ వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప

శ్రితజన ప్రియం చిందిత ప్రదం
శృతివిభూషణం సాధు జీవనం
శృతి మనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప

శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప

ఇవి కూడా చదవండి:

Ayyappa Deeksha: అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి..? ప్రారంభమైన మాలాధరణలు.. దీక్ష నియమ నిబంధనలు..!

Sabarimala: శ‌బ‌రిమ‌ల‌లో అయ్యప్పస్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ ఏమిటి..? ఒక్కో మెట్టుకు ఒక్కో విశిష్టత..!