Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. శుక్రవారం (నవంబర్ 26న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి:
అవసరానికి సహాయం చేసేవారున్నారు. శ్రమ అధికం అవుతుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. శివారాధన చేస్తే కలిసొస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి.
వృషభ రాశి:
అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. వృత్తి నిపుణులకు పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. మానసికంగా దృఢంగా ఉంటారు. శత్రు బాధలుండవు.
మిథున రాశి:
ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం పఠించడంతో శుభం కలుగుతుంది.
కర్కాటక రాశి:
మనఃస్సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు శుభకాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణ మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
సింహ రాశి:
శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి:
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.
తుల రాశి:
మంచి కాలం. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది. పాత స్నేహితులు పలకరిస్తారు.
వృశ్చిక రాశి:
ప్రారంభించబోయే పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి శుభవార్త వింటారు.
ధనుస్సు రాశి:
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. శివ నామాన్ని జపించండి.
మకర రాశి:
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. చాలాకాలంగా చేస్తున్న పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే కలిసొస్తుంది.
కుంభ రాశి:
శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది.
మీన రాశి:
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.