Holi 2022: రేపు హోలికా దహనం.. శుభ సమయం, పూజా విధానం.. కలిగే ఫలితాలు పూర్తి వివరాలు

|

Mar 16, 2022 | 9:11 PM

Holi 2022: దేశ వ్యాప్తంగా హొలీ పండగ సందడి మొదలైంది. హొలీ పండగ మొత్తానికి కీలక ఘట్టం హోలికా దహనం (Holika dahanam). ఈ ఏడాది హొలీ పండగ మార్చి 18న  పండుగను జరుపుకోనున్నారు. దీంతో ఒక రోజు ముందు అంటే..

Holi 2022: రేపు హోలికా దహనం.. శుభ సమయం, పూజా విధానం.. కలిగే ఫలితాలు పూర్తి వివరాలు
Holika Dahan 2022
Follow us on

Holi 2022: దేశ వ్యాప్తంగా హొలీ పండగ సందడి మొదలైంది. హొలీ పండగ మొత్తానికి కీలక ఘట్టం హోలికా దహనం (Holika dahanam). ఈ ఏడాది హొలీ పండగ మార్చి 18న  పండుగను జరుపుకోనున్నారు. దీంతో ఒక రోజు ముందు అంటే రేపు (మార్చి 17న ) హోలికా దహనాన్ని జరుపుకోనున్నారు. రాక్షస రాజు హిరణ్యకశిపుడు, అతని కుమారుడు ప్రహ్లాదుడి కథతో ఈ హోలికా దహన వేడుక ముడిపడి ఉంది. రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు శత్రువు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు భక్తుడు. తన కుమారుడు విష్ణుమూర్తికి భక్తుడు కావడం హిరణ్యకశిపునికి నచ్చలేదు. దీంతో తన సోదరి హోలిక సహాయంతో తన స్వంత కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

అన్న కోరిక మేరకు ప్రహ్లాదుడిని తనతో పాటు అగ్నిలో కూర్చోమని చెప్పి.. అన్న కుమారుడిని వధించాలని భావించింది. ఎందుకంటే హోలిక దగ్గర అగ్నిలో కాలని వస్త్రం ఉంది. దీంతో తాను సురక్షితంగా ఉంటానని భావించింది. అయితే మంటలు చెలరేగిన వెంటనే ప్రహ్లాదుడు తనను రక్షించమని విష్ణువును ప్రార్థించాడు. విష్ణువు తనభక్తుడైన ప్రహ్లాదుడు ప్రాణాలను రక్షించి.. హోళికను అదే మంటల్లో కాలే విధంగా శిక్షించాడని పురాణాల కథనం. అప్పటి నుండి భగవంతుని భక్తుడైన ప్రహ్లాదుని జ్ఞాపకార్థం హోలికా దహనం జరుగుతుంది.

హోలికా దహనాన్ని ప్రజలకు ఎందుకు జరుపుకుంటారంటే:  ఈ రోజున ప్రజలు హోలికను పూజిస్తారు. హోలిక అగ్నిలో అహం , చెడు దహించబడుతుందని నమ్ముతారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషలు లభిస్తుందని హిందూ పురాణాల కథనం. హోలికా పూజ చేసిన తర్వాత వారు అన్ని రకాల భయాలను జయించగలరని ప్రజలు నమ్ముతారు.

హోలికా పూజ చేసే పద్దతి: హోలికా దహనం అనేది భోగి మంటతో కూడిన ఆచారం. ప్రజలు సాధారణంగా తమ కుటుంబం, స్నేహితులతో కలిసి భోగి మంటలను వేస్తారు. పూలు, అగరబత్తీలు, అక్షత,  స్వీట్లు , పసుపు, కుంకుమ, కొబ్బరి, రంగుల నీటితో పూజించాల్సి ఉంటుంది. భోగి మంటకు ఐదు లేదా ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి ప్రార్థన చేయండి. ఈ రోజున హోలికను పూజించడం మనిషిలో అహం తగ్గి మంచి వైపు పయనిస్తారు.

శుభ సమయం: ఈ ఏడాది హోలికా దహనం మార్చి 17న జరగనుంది. శుభ సమయం రాత్రి 09:03 నుండి 10 గంటల వరకు ఉంది. మర్నాడు మార్చి 18న రంగుల పండగ హోలీని జరుపుకోనున్నారు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం ఆధారంగా ఇచ్చింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

Wines Shops: మద్యం ప్రియులకు షాకింగ న్యూస్.. రెండు రోజుల పాటు బార్లు, వైన్స్‌లు బంద్!