హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా 4..? గ్రహణ ప్రభావం ఉంటుందా..?

Holi 2026 date: ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా పండుగల తేదీల విషయంలో కొంత అయోమయం కనిపిస్తోంది. సంక్రాంతి తర్వాత 2026లో జరగనున్న హోలీ పండుగ తేదీపై చాలామందిలో సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా హోలికా దహనం ఎప్పుడు నిర్వహించాలి?, అలాగే చంద్రగ్రహణం ప్రభావం ఉంటుందా? అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే పంచాంగం ప్రకారం హోలీ పండుగను ఏ రోజున జరుపుకోవాలి? గ్రహణ ప్రభావం ఉంటుందా లేదా? అనే విషయాలను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.

హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా 4..? గ్రహణ ప్రభావం ఉంటుందా..?
Holi 2026

Updated on: Feb 25, 2026 | 2:49 PM

ప్రతీ ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా పండగల తేదీల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. సంక్రాంతి తర్వాత 2026లో హోలీ పండుగ తేదీపైనా కొంత సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా హోలికా దహనం ఎప్పుడు నిర్వహించాలి? చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరుపుకునే రంగుల పండగ రోజే చంద్ర గ్రహణం కూడా సంభవిస్తుండటంతో ఆ రోజు జరుపుకోవచ్చా? లేదా? అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పంచాంగం ప్రకారం ఏదీ రోజు జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హోలికా దహన్ 2026 – తేదీ, ముహూర్తం

సాంప్రదాయంగా ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలికా దహనం నిర్వహిస్తారు.
ద్రిక్ పంచాంగం ప్రకారం:
హోలికా దహన్ తేదీ: 2026 మార్చి 3, మంగళవారం
ముహూర్తం: సాయంత్రం 06:22 గంటల నుంచి రాత్రి 08:50 గంటల వరకు

ముఖ్యమైన తిథి సమయాలు:
పౌర్ణమి తిథి ప్రారంభం: మార్చి 2, సాయంత్రం 05:55 గంటలకు
పౌర్ణమి తిథి ముగింపు: మార్చి 3, సాయంత్రం 05:07 గంటలకు

చంద్రగ్రహణ ప్రభావం ఏమిటి?

మార్చి 3న చంద్రగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో కొంతమంది భక్తులు సందేహంలో ఉన్నారు. సాధారణంగా గ్రహణ దినాలలో సూతక కాలం పాటిస్తారు, శుభకార్యాలు నివారించాలనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు ఇంట్లోనే ఉండి దైవ నామస్మారణ చేసుకుంటూ గ్రహణ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.

అయితే.. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం, గ్రహణ ప్రభావం కారణంగా మార్చి 2 సాయంత్రం హోలికా దహనం చేయాలని సూచిస్తున్నారు. మరికొందరు పంచాంగ నిపుణులు మాత్రం మార్చి 3 సాయంత్రంనే శాస్త్రోక్త ముహూర్తమని చెబుతున్నారు. అయితే, మార్చి 3నే హోలీ జరుపుకోవాలని మెజార్టీ పండితులు సూచిస్తుండటంతో ఆ రోజునే పండగ జరుపుకోవాలని నిర్ణయించారు.

హోలికా దహన్ విశిష్టత – పురాణ గాథ

హోలికా దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం, రాక్షసరాజు హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తుడు. తన కుమారుడు విష్ణుభక్తి విడిచిపెట్టకపోవడంతో హిరణ్యకశిపుడు అతన్ని హతమార్చాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు.

అంతిమంగా తన సోదరి హోలిక సహాయంతో ఒక కుట్ర పన్నాడు. అగ్ని తగలని వరం పొందిన హోలిక, ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిచితిపై కూర్చుంది. కానీ భగవంతుని కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు; హోలిక మాత్రం అగ్నికి ఆహుతైంది.

ఈ సంఘటన భక్తి, ధర్మం ఎప్పటికీ గెలుస్తాయని తెలియజేస్తుంది. అందుకే హోలికా దహనం చెడును దహనం చేసి, మంచి ఆలోచనలు, శుభారంభాలకు సంకేతంగా జరుపుకుంటారు.

హోలీ పండుగ (రంగుల పండుగ)

హోలికా దహనం తరువాతి రోజు రంగులతో హోలీ పండుగ జరుపుకుంటారు. ఇది స్నేహం, ఆనందం, సమానత్వానికి ప్రతీక. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు.

2026లో హోలికా దహనం తేదీ విషయంలో చంద్రగ్రహణం కారణంగా కొంత గందరగోళం ఉన్నప్పటికీ, శాస్త్రోక్త ముహూర్తం, స్థానిక పంచాంగ సూచనలు ఆధారంగా నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. హోలికా దహనం మనలోని చెడును దహనం చేసి, సత్సంకల్పాలతో ముందుకు సాగాలని గుర్తు చేసే పవిత్ర ఆచారం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని విశ్వసించడం మీ వ్యక్తిగతం.)

Follow Us