Holi 2022: హోలీన ఉదయం రంగులు.. సాయంత్రం పిడిగుద్దులు..ఇదెక్కడాచారమండి బాబోయ్

Holi 2022 Celebrations: హొలీ అంటే రంగులతో పిల్లలు, పెద్దలు కలిసి చేసుకునే పండగ. అయితే ఈ హొలీ పండగను వివిధ రాష్ట్రాల్లో వివిధ సంప్రదాయాలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పిడకలతో కొట్టుకుంటే..

Holi 2022: హోలీన ఉదయం రంగులు.. సాయంత్రం పిడిగుద్దులు..ఇదెక్కడాచారమండి బాబోయ్
Holi Celebrations In Hunsa

Updated on: Mar 18, 2022 | 9:33 PM

Holi 2022 Celebrations: హొలీ అంటే రంగులతో పిల్లలు, పెద్దలు కలిసి చేసుకునే పండగ. అయితే ఈ హొలీ పండగను వివిధ రాష్ట్రాల్లో వివిధ సంప్రదాయాలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పిడకలతో కొట్టుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో అల్లుళ్లను కొడతారు… ఇంకొన్ని ప్రాంతాల్లో చెప్పుల(Slippers Holi)తో కొట్టుకుంటారు.. అంతేకాదు.. హొలీ పండగ(holi festival) రోజున పగలు రంగులతో ఆడుకుంటూ ఎంతో సంతోషముగా గడిపే ప్రజలు.. సాయంత్రం అయితే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. హొలీ రోజున ఈ వింతసంప్రదాయాన్ని పాటించే గ్రామం తెలంగాణాలో ఉంది.

అవును ఆ గ్రామంలో జనం హొలీ పర్వదినాన ఉదయం రంగులతో ఆదుకున్నారు. సంబరాలను చేసుకున్నారు. సాయంత్రం కాగానే ఊరంతా ఒక చోటకు చేరుకొని.. పిడికిళ్లు బిగించి ఇష్టారీతిన కొట్టుకున్నారు. ఈ హొలీ సంబరాలు  నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలంలోని హున్సా గ్రామంలో జరిగాయి.

ఈ హున్సా గ్రామంలో హొలీ రోజున ఈ వింత ఆచారాన్ని కొన్ని వందల ఏళ్లుగా పాటిస్తున్నారు. ఇలా గత 300 ఏళ్లుగా ఈ గ్రామంలో హొలీ రోజున సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తమ ఆచారంలో భాగంగానే ఈరోజు  ఉదయమంతా రంగులు చల్లుకున్నారు. కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఊరి మధ్యలోని ఆంజనేయస్వామి గుడి ముందుకు ఊరేగింపుగా అంతా చేరుకున్నారు.  అక్కడే ఉన్న స్తంభాలకు బలంగా ఓ తాడుకట్టారు. ఇరువైపులా ఉన్న జనం.. సామాజిక వర్గాలుగా విడిపోయిమొదటగా కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా.. గ్రామం నలుమూలల నుంచి పురుషులంతా  పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.

వాళ్ల మధ్యలో ఎలాంటి గొడవలు ఉండవు.. అయినప్పటికీ పిడికిళ్లు బిగించి ఇష్టమున్నట్టు ఒకరినొకరు కొట్టుకున్నారు. పది నిమిషాల పాటు కొట్టుకున్న తరువాత తాడు వదిలేయడంతో ఆట ముగిసింది. ఈ తంతును మహిళలు, పిల్లలంతా ఎంతో ఆసక్తిగా వీక్షించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని ఎక్కువ పిడిగుద్దులు కురిపించిన వారిని భుజాలపై ఎత్తుకుని తమ వాడలకు తీసుకెళ్లారు. కొట్లాటలో గాయాలు అయినవారు కామదహనంలోని బూడిదను ఒంటికి పూసుకున్నారు. అయితే దీనిని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఈ గ్రామస్థులు పోలీసులు ఆంక్షలను లెక్కచేయరు.. హొలీ రోజున ఇలా చేయకపోతే అరిష్టమని గ్రామస్థులు భావిస్తారు. అందుకనే ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా  ఈరోజు కూడా ఈ పిడిగుద్దులాటను కొనసాగించారు.

 

Also Read: పిల్లలతో సరదాగా హోలీ సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ భామ..

Alia Bhatt Net Worth: 29 ఏళ్ల సీతమ్మకు సంపదను పెట్టుబడి పెట్టడం ఇష్టం.. ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్