Ghatika Siddeswaram Temple: అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రాంతం.. 6వ శతాబ్దానికి పూర్వం వెలసిన పుణ్యక్షేత్రం ..!

|

Jan 18, 2021 | 9:52 PM

తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో తెలియని.. పుణ్యక్షేత్రాలు.. కొండకోనల నడుమ ప్రకృతి అందాలతో అలరారుతున్నాయి.. అటువంటి పుణ్యక్షేత్రం ఒకటి ఘటిక సిద్ధేశ్వరం.. ఈ పురాతన ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని..

Ghatika Siddeswaram Temple: అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రాంతం.. 6వ శతాబ్దానికి పూర్వం వెలసిన పుణ్యక్షేత్రం ..!
Follow us on

Ghatika Siddeswaram Temple: తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో తెలియని.. పుణ్యక్షేత్రాలు.. కొండకోనల నడుమ ప్రకృతి అందాలతో అలరారుతున్నాయి.. అటువంటి పుణ్యక్షేత్రం ఒకటి ఘటిక సిద్ధేశ్వరం.. ఈ పురాతన ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉంది.  సీతారామపురం మండలంలోని సిద్దేశ్వర కోనలో ఉంది. ఘటిక సిద్ధేశ్వరం. చూట్టూ పెద్ద కొండలు.. పచ్చని చెట్ల మధ్య ఉన్న ఘటిక సిద్ధేశ్వరం చాలా ప్రశాంత వాతావరణంతో నిండి ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊర్లనుండి భక్తులు విచ్చేస్తుంటారు.

ఆలయ చరిత్ర :

అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఇది ఒకటి. 6వ శతాబ్దానికి పూర్వం వెలసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నారు.1406లో విజయనగరం సామ్రాజ్యాన్ని పాలించిన రెండో హరిహరరాయులు, ఆయన తనయుడు మొదటి దేవరాయులు ఈ ఆలయానికి ప్రాకార మండపం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం జీర్ణవ్యవస్థకు చేరుకున్న సమయంలో … 1974లో అవధూత కాశినాయన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఎతైన కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల నడుమ మనసును మైమరపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది.

ఉత్సవాలు:

ప్రతి సంవత్సరం శివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇచట కొలువుదీరిన ఇష్టకామేశ్వరీదేవి అమ్మవారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలందుకుంటారు.

వసతి సాకర్యాలు:

ఈ క్షేత్రాన్ని వచ్చే భక్తులు సొంత వాహనాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఇక్కడ కొండపై నుంచి ఎల్లప్పుడు నీరు ప్రవహిస్తున్నందు వలన మంచినీటికి ఇబ్బంది లేదు. ఇక్కడకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఉత్సవాల సమయంలో తప్పక మామూలు రోజుల్లో సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. ఒకవేళ రాత్రికి ఇక్కడే ఉండవలసి వస్తే వసతి సౌకర్యాలకు కొదవలేదు.

Also Read: కొండకోనల్లో దారిలేని చోట అత్యవసర పరిస్థితుల్లో ఆపద్బంధువు బైక్ అంబులెన్స్