Chitra Gupta Temple: పాపాలు తొలగించి దీర్ఘాయుస్సు ఇచ్చే చిత్ర గుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉంది? ఎలా పూజించాలంటే

యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడుకి హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. చిత్రం అంటే అద్భుతం, గుప్త అంటే రహస్యం కనుక అతన్ని చిత్రగుప్తుడు అని పిలుస్తారు. దేశంలో చిత్ర గుప్తుడికి ఆలయాలు తక్కువగానే ఉన్నాయి. హైదరబాద్, తమిళనాడు సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిత్రగుప్తుడి ఆలయాలున్నాయి. ఈ రోజు తమిళనాడులోని తేని జిల్లాలోని కోడంగిపట్టిలో చిత్రగుప్తుడి ఆలయ చరిత్ర, దర్శన సమయాలు ,ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

Chitra Gupta Temple: పాపాలు తొలగించి దీర్ఘాయుస్సు ఇచ్చే చిత్ర గుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉంది? ఎలా పూజించాలంటే
Chitra Gupta Temple

Updated on: May 12, 2025 | 12:54 PM

సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్య తిధులకు ముఖ్య స్థానం ఉంది. హిందూ మతంలో ఈ తిధులకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి నెలా వచ్చే పౌర్ణమిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజును చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అదే సమయంలో మానవుల మంచి చెడులను అంచనా వేసే చిట్టాలను రాసే చిత్రగుప్తుడుకి పౌర్ణమి తిదికి మంచి సంబంధం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో చిత్రగుప్తుడికి ప్రత్యేక ఆలయం ఉంది. దీని తరువాత చిత్రగుప్తుడు అనే చిత్రగుప్త ఆలయం తేని జిల్లాలోని కోడంగి పట్టిలో ఉంది. ఈ రోజు ఈ ఆలయం గురించి తెలుసుకుందాం..

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే

ఈ ఆలయం తేని నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మధురై-కొచ్చి జాతీయ రహదారిపై బోడినాయకనూర్ వెళ్ళే మార్గంలో ఉంది. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది.

ఈ ఆలయ చరిత్ర

సాధారణంగా శివుడు ఒకప్పుడు ఈ ప్రపంచంలోని జీవుల చర్యలన్నింటినీ నమోదు చేయాలనుకున్నాడు. ఆ పని ఎవరికి అప్పగించాలని పార్వతి దేవిని అడిగాడు. అప్పుడు శివుడు బంగారు పళ్ళెంలో బొమ్మ గీసాడు. ఆ చిత్రం పార్వతిని ఆకట్టుకుంది. దీనిని గురించి శివుడు వివరంగా చెప్పాలనుకున్నాడు. శివుడు, పార్వతి దైవానుగ్రహంతో చిత్రం ఒక దేవుడిగా మారింది. భూలోకంలో ఉన్న మానవులందరి కర్మలను లిఖించే బాధ్యతను శివుడికి అప్పగించాడు. చిత్ర (పిక్చర్), గుప్త (రహస్యం) నుంచి ఉద్భవించినందున అతను చిత్రగుప్తుగా పేరుగాంచాడు. యమ ధర్మ రాజుకి మంత్రిగా చిత్ర గుప్తుడు నియమించబడ్డాడు. అయితే ఇక్కడ అలయం కోడంగి పట్టి ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తికి చిత్రగుప్తుడు కలలో కనిపించి.. ఈ పట్టణంలో ఒక ఆలయాన్ని నిర్మించి తనను పూజించమని చెప్పాడు. అందుకే ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారని చెబుతారు.

ఇవి కూడా చదవండి

చిత్ర గుప్తుడి పూజకి ఉన్న ప్రత్యేకత ఏమిటి?

చిత్రగుప్తుడు జన్మించిన పౌర్ణమి రోజున నూనెతో స్నానం చేస్తే పాపాలు తగ్గుతాయని నమ్ముతారు. చిత్ర గుప్తుడికి, భార్య ప్రభావతిని పూజలు చేయాలి. అలాగే చిత్ర గుప్తుడు ఆవు గర్భం నుంచి జన్మించాడు కనుక ఈ రోజు ఇంట్లో ఆవు పాలు, పెరుగు లేదా ఆకుకూరలు ఖచ్చితంగా ఉపయోగించకూడదు. అలాగే ఈ రోజు ఇంట్లో పూజ గదిలో చిత్రగుప్తుని శ్లోకాన్ని జపిస్తూ పూజిస్తే దీర్ఘాయుష్షును అనుగ్రహిస్తాడని నమ్మకం.

ఈ చిత్ర గుప్తుడి ఆలయంలో పూజలు చేయడం వలన కేతువు దోషం తొలగి పోతుందని నమ్మకం. తొమ్మిది గ్రహాలలో చిత్రగుప్తుడు కేతువుకు అధిపతి. పౌర్ణమి రోజున మహిళలు ఉపవాసం ఉండి ఉప్పు లేని ఆహారం తింటే దీర్ఘాయుష్షు పొందుతారని కూడా నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు