కేరళలోని మలప్పురం జిల్లాలో కొండొట్టికి సమీపంలో ఉన్న ముత్తువల్లూరులోని దుర్గా భగవతి ఆలయం హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. 400 ఏళ్ల చరిత్ర గల ఆలయ పునరుద్ధరణ కోసం హిందువులు, ముస్లింలు చేతులు కలిపారు. 2015 నుంచి గ్రామస్తులు వనరులను సేకరించి ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించారు.స్నేహం, సోదరభావానికి మతపరమైన సరిహద్దులు లేవని ఆలయ నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ.50 లక్షల్లో ఎక్కువ మొత్తం అంటే 38 లక్షల రూపాయలను ముస్లిం వర్గీయులు ఇచ్చినట్లు ఆలయ యాజమాన్య కమిటీ అధ్యక్షుడు పి.చంద్రన్ తెలిపారు. ఆలయ నిర్మాణ సామగ్రిని కూడా అందించారు. ఆలయ ఉత్సవాలకు ఉదారంగా కూరగాయలు సరఫరా చేస్తున్నారని తెలిపారు. 2023లో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో తంగల్ ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు KP సులైమాన్ హాజీ రూ. 1 లక్ష విరాళం అందించారు.
కొత్త విగ్రహ ప్రతిష్టాపన మేలో జరగనుంది. మే 7వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఈ ఆలయంలో 173 సెం.మీ.ల దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్నాయి. ఈ ఆలయవిగ్రహ ప్రతిష్టాపన వేడుకలకు హిందువులకు మాత్రమే కాదు ముస్లిం సమాజానికి చెందిన నాయకులకు ఆహ్వానాలను అందించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..