కృష్ణుడిని విఠలుడుగా ఎందుకు పిలుస్తారు? బాలుడిలా నవ్వుతూ ఉండే స్వామి రూపం వెనుక పురాణ కథ ఏమిటంటే..

|

Dec 06, 2024 | 6:00 AM

హిందూ మతంలో త్రిమూర్తులలో లోక రక్షకుడు అయిన శ్రీ మహా విష్ణువు.. లోక ప్రయోజనాల కోసం అనేక అవతారాలను దాల్చాడు. శ్రీ మహా విష్ణువును అనేక పేర్లతో కూడా పిలుస్తారు. వాటిలో ఒకటి విఠలుడు. విష్ణువుకి ఈ పేరు ఎలా వచ్చింది? పురాణ కథ ఏమిటంటే

కృష్ణుడిని విఠలుడుగా ఎందుకు పిలుస్తారు? బాలుడిలా నవ్వుతూ ఉండే స్వామి రూపం వెనుక పురాణ కథ ఏమిటంటే..
Lord Vitthal
Follow us on

త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు విశ్వానికి రక్షకుడిగా పూజింపబడుతున్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం, యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై మహా విష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. అయితే ఈ అవతారాల్లో దశావతారాలు ముఖ్యం. అందులో ఒకటి విఠలుడు. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అంశగా భావిస్తారు. ముఖ్యంగా విష్ణువును మహారాష్ట్రలో ఈ పేరుతో పిలుస్తారు. విఠల స్వామి ఆలయాలు చాలా ఉన్నాయి. విఠలుడిని భక్తి శ్రద్దలతో నియమ నిష్టలతో పూజిస్తారు. అయితే మహావిష్ణువుకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. దీనికి సంబంధించిన పురాణ కథేంటో తెలుసుకుందాం.

శ్రీహరి విఠలుడి అవతార కథ (శ్రీహరి విఠల్ కి కథ)

పురాణ కథ ప్రకారం ఒకసారి రుక్మిణీ దేవి ఏదో సమస్యపై శ్రీ కృష్ణుడి పై కోపంతో ద్వారకను విడిచిపెట్టింది. ఆ తర్వాత కృష్ణుడు తన భార్య రుక్మిణిని కోసం వెతుకుతూ డిండి అడవికి చేరుకున్నాడు, అక్కడ అతను రుక్మిణి దేవిని కనుగొన్నాడు. అప్పటికి రుక్మిణి దేవి కోపం చల్లారింది. అదే సమయంలో అక్కడ ఒక ఆశ్రమంలో విష్ణు భక్తుడు నివసిస్తున్నాడు. అతని పేరు పుండలీకుడు. తల్లిదండ్రులకు ఎంతో సేవ చేసేవాడు. పుండలికుడి భక్తికి సంతోషించిన శ్రీ కృష్ణుడు, తన రుక్మిణీ దేవితో కలిసి పుండలీకుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అయితే అప్పుడు పుండలీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేయడంలో బిజీగా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో తన కోసం వచ్చిన శ్రీ కృష్ణుడిని కొంత సమయం వేచి ఉండమని పుండలీకుడు కృష్ణుడిని కోరాడు.

ఇవి కూడా చదవండి

ఇటుక మీద నిలబడి వేచి ఉన్న కృష్ణుడు

పుండలీకుడు,, కృష్ణుడు దగ్గరకు ఒక ఇటుక విసిరి.. దానిపై నిలబడి వేచి ఉండమని కోరాడు. ఆ తర్వాత తన భక్తుని మాటకు కట్టుబడిన శ్రీ కృష్ణుడు ఆ ఇటుకపై నిలబడి అతని కోసం వేచి పుండలీకుడి రాక కోసం వేచి చూస్తున్నాడు. అప్పుడు తన భర్తతో పాటు రురుక్మిణీ దేవి ఇటుకపై నిలబడి వేచి ఉంది. పుండలీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేసి అనంతరం తన కోసం వేచి చూస్తున్న కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు పుండలీకుడుకి తల్లిదండ్రుల మీద ఉన్న భక్తిశ్రద్దలను చూసి సంతసించిన విష్ణువు పుండలీకుదిని వరం కోరుకోమని అడిగాడు.

పుండలీకుడు కోరిన వరం ఏమిటంటే

శ్రీ కృష్ణుడు పుండలీకుడిని వరం కోరమని కోరగా, పుండలీకుడు శ్రీ హరిని ఇక్కడే ఉండమని కోరాడు. ఆ తరువాత భక్తుడి ఈ భక్తిని చూసిన శ్రీ హరి అదే ఇటుకపై తన నడుముపై చేతులు ఉంచి, సంతోషకరమైన భంగిమలో నిలబడ్డాడు. అప్పటి నుంచి కృష్ణుడికి విఠలుడు అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. ఇటుకను మరాఠీలో విట్ అని పిలుస్తారు. కనుక ఇటుకపై నిలబడి ఉన్నందున శ్రీ కృష్ణుడికి విఠలుడు అని పేరు వచ్చింది.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.