Hanuman Jayanti: హనుమాన్ జయంతి రోజున ఏ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం.. వేటిని తీసుకురావడం అశుభం అంటే

|

Apr 16, 2024 | 7:12 PM

హనుమంతుడి జన్మదినోత్సవ పండుగ చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం వచ్చింది. ఈ ఏడాది హనుమంతుడి  జయంతి మంగళవారం రోజున వచ్చింది కనుక చాలా ప్రత్యేకం. హనుమంతుడి జన్మదినోత్సవం రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయని.. కష్టాల నుంచి  ఉపశమనం లభిస్తుందని నమ్మకం . హనుమంతుడి జన్మదినోత్సవం రోజున ఇంటికి ఏ వస్తువులను తీసుకుని తెచ్చుకుంటే శుభం, ఏవి తెస్తే అశుభమో తెలుసుకుందాం.

Hanuman Jayanti: హనుమాన్ జయంతి రోజున ఏ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం.. వేటిని తీసుకురావడం అశుభం అంటే
Hanuman Jayanti Puja Tips
Follow us on

రామ భక్త హనుమాన్ కు హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. మంగళ, శనివారాలు మాత్రమే కాదు హనుమంతుడి జన్మదినోత్సవం రోజున కూడా అత్యంత భక్తి శ్రద్దలతో ఆంజనేయస్వామిని పూజిస్తారు. హిందువులు హనుమాన్ జయంతి పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దేశ వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో .. ఎంతో ఉత్సాహంగా హనుమంతుడి జయంతిని జరుపుకుంటారు. హనుమంతుడిని సంకట మోచనుడు అని  కూడా అంటారు. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా భయం, వ్యాధి, నొప్పి కష్టాలు వంటి అన్ని రకాల ప్రతికూల శక్తి నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.

హనుమంతుడి జన్మదినోత్సవ పండుగ చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం వచ్చింది. ఈ ఏడాది హనుమంతుడి  జయంతి మంగళవారం రోజున వచ్చింది కనుక చాలా ప్రత్యేకం. హనుమంతుడి జన్మదినోత్సవం రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయని.. కష్టాల నుంచి  ఉపశమనం లభిస్తుందని నమ్మకం . హనుమంతుడి జన్మదినోత్సవం రోజున ఇంటికి ఏ వస్తువులను తీసుకుని తెచ్చుకుంటే శుభం, ఏవి తెస్తే అశుభమో తెలుసుకుందాం.

ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం

  1. హనుమంతుడి విగ్రహం లేదా చిత్ర పటం : పురాణాల నమ్మకం ప్రకారం హనుమంతుడి జన్మదినోత్సవం రోజున హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే హనుమంతుడి కూర్చున్న లేదా నిలబడిన భంగిమలో విగ్రహం లేదా చిత్ర పటం తీసుకుని రావాల్సి ఉంటుంది.
  2. సింధూరం : సింధూరం హనుమంతుడికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. కనుక రామ భక్త హనుమాన్ జన్మ దినోత్సవము రోజున ఇంటికి సింధూరాన్ని తీసుకునిరావడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
  3. కుంకుమపువ్వు :కుంకుమపువ్వు కూడా హనుమంతుడికి ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. హనుమాన్ జయంతి రోజున, కుంకుమను ఇంటికి తెచ్చి, దానితో హనుమంతుడిని పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
  4. కాషాయపు జెండా : హనుమాన్ జయంతి రోజున హనుమంతుని జెండాను ఇంటికి తీసుకురావడం కూడా చాలా మంచిదని భావిస్తారు. ఈ జెండాను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి.
  5. పండ్లు , స్వీట్లు : ఆంజనేయస్వామి జన్మదినోత్సవం రోజున నైవేద్యంగా పండ్లు, స్వీట్లు సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే హనుమాన్ జయంతి రోజున అరటి పండ్లు, యాపిల్, కమలాఫలం వంటి వాటిని హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. వీటి సంఖ్య ఐదు ఉండేలా చూసుకోండి.
  6. ధూపం, దీపం : హనుమాన్ జన్మదినోత్సవం రోజున ఇంట్లో దీపాలు, అగరబత్తీలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడంవలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
  7. ఎరుపు రంగు వస్తువులు :  హనుమంతుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కనుక ఆంజనేయుడు జన్మదినోత్సవం రోజున, ఎరుపు రంగు బట్టలు లేదా ఎరుపు రంగు పువ్వులు వంటి ఎరుపు రంగు వస్తువులను ఇంటికి తీసుకురండి.

ఏ వస్తువులను ఇంటికి తీసుకురావడం అశుభం అంటే..

  1. మాంసాహార ఆహారం, మధ్య పానీయాలు: హనుమాన్ జయంతి రోజున మాంసాహారం, మద్యం సేవించకూడదు. ఇలా చేయడం అశుభంగా భావిస్తారు.
  2. బ్రహ్మచర్యం: హనుమంతుడి జన్మదినోత్సవం రోజున లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉంది.. బ్రహ్మచర్యం పాటించండి.
  3. నలుపు వస్తువులు: రామ భక్తుడికి ఇష్టమైన రంగు ఎరుపు. అదే సమయంలో నలుపు రంగు హనుమంతుడికి ఇష్టమైన రంగుగా పరిగణించబడదు. కనుక హనుమంతుడి జన్మదినోత్సవం రోజున నలుపు రంగు వస్తువులను ఇంట్లోకి తీసుకు రావద్దు. నలుపు దుస్తులను ధరించవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు