Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజున ఈ 5 మంత్రాలను పఠించండి.. అన్ని కష్టాలు తొలగిపోతాయి

|

Apr 22, 2024 | 3:27 PM

హనుమాన్ జయంతి సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో ఈ 5 మంత్రాలను పఠించడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మంత్రాలను పఠించడానికి కూడా మంచి సమయంగా పరిగణించబడుతుంది. ప్రశాంతమైన, పవిత్రమైన ప్రదేశంలో ఈ మంత్రాలను జపించండి. పూజా స్థలం శుభ్రంగా ఉండాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ మంత్రాలను జపించండి.

Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజున ఈ 5 మంత్రాలను పఠించండి.. అన్ని కష్టాలు తొలగిపోతాయి
Hanuman Jayanti 2024
Follow us on

రామ భక్త హనుమంతుడి జన్మదినోత్సవం సందర్భంగా బజరంగబలిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, ఆంజనేయస్వామిని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించండి. ఈ మంత్రాలను పఠించడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందడంతోపాటు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హనుమంతుడిని  పూజించాలంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేసి, ఉపవాసం ఉంటానని ప్రమాణం చేయండి. ఇంటిలోని పూజ గదిలో నియమ నిష్ఠలతో పూజ చేసి హనుమాన్ చాలీసాను చదవండి. ఇలా చేయడం వలన హృదయానికి శాంతిని ఇస్తుంది. బజరంగబలి ఆశీస్సులు మీపై ఉంటాయి. అంతేకాదు మీ  జీవితంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు.

హనుమాన్ జయంతి పూజకు అనుకూలమైన సమయం

మొదటి శుభ సమయం: ఏప్రిల్ 23, ఉదయం 09:03 నుండి మధ్యాహ్నం 01:58 వరకు

రెండవ శుభ సమయం: ఏప్రిల్ 23, రాత్రి 08:14 నుండి 09:35 వరకు

ఇవి కూడా చదవండి

బ్రహ్మ ముహూర్తం- ఏప్రిల్ 23 ఉదయం 4.20 నుండి 05.04 వరకు

అభిజీత్ ముహూర్తం – ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:46 వరకు

1. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు భయం కలగదు

ఓం హం హనుమతే నమః
ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్.
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్దతే | హారిణే వజ్రదేహాయ చోల్లంఘితమహాబ్దయే ||

2. బజరంగబలి మంత్రం

ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ సర్వ శత్రు సంహరణాయ సర్వరోగ హరాయ సర్వవశికరణాయ రామదూతాయ స్వాహా!

3. ఈ మంత్రాన్ని పఠిస్తే రుణభారం తొలగిపోతుంది

ఓం నమో హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహా

4. ఈ మంత్రాన్ని పఠించడం వలన మీకు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది

ఆదిదేవ నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ॥ ఆది దేవా సూర్యుడా సప్త మహాసముద్రాల నుంచి మమ్మల్ని రక్షించు. సాటిలేని బలానికి, బంగారు పర్వతం వంటి శరీరానికి,  జ్ఞానులలో అగ్రగామికి నా ప్రణామాలు.

5. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి

ఓ ఆదిదేవా.. నీకు నమస్కరిస్తున్నాను. ఓ సూర్యుడా! నీవు సూర్యుడు, ప్రపంచ మహాసముద్రం నుండి మమ్మల్ని రక్షించు !!

హనుమంతుడి మంత్రాన్ని జపించడానికి నియమాలు

హనుమాన్ జయంతి సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో ఈ 5 మంత్రాలను పఠించడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మంత్రాలను పఠించడానికి కూడా మంచి సమయంగా పరిగణించబడుతుంది. ప్రశాంతమైన, పవిత్రమైన ప్రదేశంలో ఈ మంత్రాలను జపించండి. పూజా స్థలం శుభ్రంగా ఉండాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ మంత్రాలను జపించండి. ఈ మంత్రాలను జపించేటప్పుడు స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. మంత్రాన్ని జపించేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని, పూర్తి ఏకాగ్రతతో కనీసం 108 సార్లు జపించండి. దీనితో బజరంగబలి ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు