దేశానికి రాజైనా ఒక గురువుకి శిష్యుడే.. మన పురాణాల్లో ఉత్తమ గురు-శిష్యులు..

|

Jul 20, 2024 | 12:51 PM

గురువు అమూల్యమైన జ్ఞాన సంపదను శిష్యునిలోకి ప్రవహింపజేసే శక్తి. ఒక రాయిని అందమైన శిల్పంగా మార్చడంలో గురువు పాత్ర గొప్పది. గురువు అనుగ్రహంతో, గురువు అపారమైన జ్ఞానంతో ప్రపంచాన్ని జయించిన వ్యక్తుల గురించి పురాణాల్లో, చరిత్రల్లో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. ఈ రోజు గురు పౌర్ణమి శుభ సందర్భంగా.. మనందరికీ స్ఫూర్తినిచ్చే పౌరాణిక గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం..

దేశానికి రాజైనా ఒక గురువుకి శిష్యుడే.. మన పురాణాల్లో ఉత్తమ గురు-శిష్యులు..
Best Guru Shishya In History
Follow us on

తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుకి స్థానం ఇచ్చాం. గురువు బ్రహ్మ.. గురువు విష్ణువు.. గురువు శివుడు అంటూ కీరిస్తాం.. దేశాన్ని ఏలే రాజైనా సరే ఒక గురువుకి శిష్యుడే.. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముడైనా ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే.. గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం. మన పురాణాల్లో చరిత్రలో దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజు మన పురాణాలలో పేర్కొన్న ఉత్తమ గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం.

గురువు అమూల్యమైన జ్ఞాన సంపదను శిష్యునిలోకి ప్రవహింపజేసే శక్తి. ఒక రాయిని అందమైన శిల్పంగా మార్చడంలో గురువు పాత్ర గొప్పది. గురువు అనుగ్రహంతో, గురువు అపారమైన జ్ఞానంతో ప్రపంచాన్ని జయించిన వ్యక్తుల గురించి పురాణాల్లో, చరిత్రల్లో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. ఈ రోజు గురు పౌర్ణమి శుభ సందర్భంగా.. మనందరికీ స్ఫూర్తినిచ్చే పౌరాణిక గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం..

పురాణాల్లో ప్రముఖ గురు శిష్య జంటలు

ఇవి కూడా చదవండి

సాందీపని ఋషి-శ్రీ కృష్ణ:

ప్రపంచానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీ కృష్ణుని గురువు సాందీపని మహర్షి. మథురలో కంసుడిని చంపిన అనంతరం గోకులంలో గోవుల కాపరి అయిన శ్రీ కృష్ణుడు అన్న బలరాముడితో కలిసి విద్యను అభ్యసించడానికి ఉజ్జయినిలోని సాందీపని ఆశ్రమానికి వెళ్ళాడు. ఇక్కడ కృష్ణుడు సాందీప మహర్షి వద్ద నుంచి 64 రోజులలో 64 కళలను జ్ఞాన నేర్చుకున్నాడు. తర్వాత కలాక్రమంలో మొత్తం ప్రపంచానికి మనవ జీవితం ప్రయాణం గురించి బోధించాడు. ఈ గురు-శిష్య ద్వయం నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

వశిష్ట ముని – శ్రీరాముడు:

గురువు వశిష్ఠుడు దశరథ మహారాజు నలుగురు కుమారులైన రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులకు విద్యను బోధించాడు. రాముడు అతని నుండి వేదాలతో సహా అనేక విద్యలను నేర్చుకున్నాడు. రామాయణంలో రాముడు, రావణుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు రాముడి విలువిద్య నైపుణ్యాలు కూడా ప్రస్తావించబడ్డాయి. వశిష్ఠ మునిలు ఈ విలువిద్యలను, విల్లును రాముడికి అందించారు. ఈ అద్భుతమైన గురు-శిష్య ద్వయం నేటి తరానికి స్పూర్తి దాయకం.

ద్రోణాచార్య – అర్జునుడు:

గురువు ద్రోణాచార్యుడు పాండవ, కౌరవ యువరాజులకు యుద్ధ విద్యలు నేర్పాడు. అర్జునుడు ఏకాగ్రత చూసిన ద్రోణాచార్యుడు అతనిని అభిమానించాడు. ప్రియు శిష్యుడిగా భావించాడు. అర్జునుని తన సొంత కొడుకు అశ్వథామ కంటే ఎక్కువగా ప్రేమించాడు. అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గర అపారమైన పాండిత్యాన్ని, విలువిద్యను నేర్చుకుని గొప్ప విలుకాడు అయ్యాడు. ఈ ఇద్దరినీ ప్రపంచంలోనే అద్భుతమైన గురు శిష్యులు అని చెబుతారు. అందుకనే మన భారత ప్రభుత్వం దేశంలోని క్రీడా రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులకు అర్జున అవార్డును.. కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తుంది.

చాణక్య – చంద్రగుప్త మౌర్య:

ఆచార్య చాణక్యుడు మౌర్య రాజవంశానికి రాజకీయ గురువు. మగధ చక్రవర్తి ధనందుడు చేసిన అవమానానికి ప్రతిగా మగధ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి.. ఒక సామాన్య బాలుడిని చక్రవర్తిగా చేశాస్డు. చాణుక్యుడు శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు నంద వంశానికి అపారమైన జ్ఞానాన్ని, సకల శాస్త్రాలను ప్రసాదించి మౌర్య వంశ ఆవిర్భావానికి కారణమయ్యాడు. తరువాత చంద్రగుప్తుడు.. తన గురువు చాణక్యుడు అడుగు జాడల్లో నడిచి అఖండ భారతాన్ని స్థాపించారు. ఈ గురు-శిష్య ద్వయం నుండి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకోవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..