Garuda Puranam: ఈ 5 తప్పులు జీవితంలో ఎప్పుడూ చేయొద్దు.. ఒకవేళ చేస్తే మరణం తర్వాత.!

|

Oct 29, 2021 | 9:30 AM

గొప్ప పురాణాల్లో 'గరుడ పురాణం' ఒకటి. ఇందులో ఒక వ్యక్తి కర్మల ప్రకారం లభించే ఫలాల గురించి వివరంగా చెప్పబడింది. ఈ మహాపురాణం...

Garuda Puranam: ఈ 5 తప్పులు జీవితంలో ఎప్పుడూ చేయొద్దు.. ఒకవేళ చేస్తే మరణం తర్వాత.!
Garuda Puranam
Follow us on

గొప్ప పురాణాల్లో ‘గరుడ పురాణం’ ఒకటి. ఇందులో ఒక వ్యక్తి కర్మల ప్రకారం లభించే ఫలాల గురించి వివరంగా చెప్పబడింది. ఈ మహాపురాణం ముఖ్య ఉద్దేశం ప్రజలను ధర్మ మార్గం వైపు నడిపించడం. మనం చేసే పాపపుణ్యాలు స్వర్గం లేదా నరకానికి దిశనిర్దేశాలు అవుతాయని గరుడ పురాణం చెబుతోంది. ఒక వ్యక్తి మరణాంతరం కూడా మోక్షాన్ని పొందుతాడని గరుడ పురాణంలో పేర్కొంది. అలాగే ఏయే పనులు ఘోర పాపాలకు నిదర్శనాలన్నది ప్రస్తావించబడింది.

అలాంటి పనులు చేసినవారు ఖచ్చితంగా మరణం తర్వాత నరకయాతనలు అనుభవించాల్సి వస్తుందట. గరుడ పురాణంలో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా విష్ణుమూర్తి నోటి నుంచి వచ్చినవే. గరుడ పక్షి అడిగిన ప్రశ్నలకు.. విష్ణువు ఇచ్చిన సమాధానాల సంకలనమే గరుడ పురాణం. ఒక వ్యక్తి చేయకూడనివి.. మహా పాపాలుగా భావించే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ 5 పనులు ఎప్పుడూ చేయకండి..

1. పిండాన్ని, అప్పుడే పుట్టిన బిడ్డను, గర్భవతిని చంపడం మహాపాపంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తులు మరణానంతరం అనేక రకాల శిక్షలను అనుభవిస్తారు.

2. స్త్రీని అవమానించి, దూషించేవారు, అలాగే గర్భిణీ స్త్రీలు లేదా రుతుక్రమంలో ఉన్న స్త్రీలను ఎగతాళి చేయడం, వారితో అసభ్యంగా ప్రవర్తించేవారి జీవితాలు నాశనం అవుతాయని గరుడ పురాణం చెబుతోంది. మరణానంతరం వారు నరకంలో కఠినమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుందట.

3. బలహీనులను, వృద్ధులను, పేదవారిని వేధించేవారు, అలాగే వారిని దోపిడీ చేసేవారికి మరణానంతరం నరకం అనుభవించాల్సి ఉంటుంది. నరకంలో రకరకాల శిక్షలు అనుభవిస్తారు.

4. స్నేహితుడిపైనా, లేదా మరేదైనా స్త్రీపై దురుద్దేశంతో ఏదైనా చేయాలనుకున్న వారికి, అలాగే స్త్రీని దోపిడీ చేయాలనుకునేవారికి, ఆమెతో తప్పుగా ప్రవర్తించినవారు నరకంలో కఠినమైన శిక్షలు అనుభవిస్తారు.

5. దేవాలయాలను, మత గ్రంధాలను ఎగతాళి చేసేవారిని పాపులుగా పరిగణిస్తారు. ప్రజలకు సరైన మార్గాన్ని చూపడానికి గ్రంథాలు ఉన్నాయి. అలాగే వ్యక్తిలో సానుకూలతను తీసుకురావడానికి, వారిని ధర్మమార్గంలోకి తీసుకురావడానికి ఆలయాలు నిర్మించబడ్డాయి. చాలామంది వీటిని దర్శించుకుంటారు. అలాంటి వాటిని అస్సలు ఎగతాళి చేయకూడదు. ఎగతాళి చేసినవారికి మరణానంతరం నరకంలో స్థానం లభిస్తుంది.

(ఈ సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.)

Also Read:

తవ్వకాల్లో దొరికిన 100 ఏళ్లనాటి ప్రేమలేఖ.. అందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

వాకింగ్ ట్రాక్‌పై నల్లటి ఆకారం.. దగ్గరకు వెళ్లి చూడగా సడన్ షాక్.. వైరల్ వీడియో.!