హిందూ మతంలో 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఇందులో మనిషి జనన, మరణానికి సంబంధించిన అనేక రహస్యాలను ప్రస్తావిస్తుంది. ఈ ముఖ్యమైన పురాణం పాపాలు, పుణ్యాలు, కర్మలను కూడా వివరిస్తుంది. ఏ కర్మ నరక ప్రయాణానికి దారితీస్తుందో.. ఏ కర్మలు స్వర్గవాసానికి దారితీస్తాయో.. ఏ కర్మలు ముక్తికి, విముక్తికి దారితీస్తాయో వివరించబడింది. గరుడ పురాణం ఈ పురాణం విష్ణువు, అతని వాహనమైన పక్షి రాజు గరుత్మంతుడు మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా రచించబడిన గ్రంథం.
హిందూ మతంలో ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం మోక్ష సాధనంగా పరిగణించబడుతుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం.. ఏకాదశి పూజ ప్రాముఖ్యతను గురించి గరుడ పురాణంలో కూడా వివరించబడింది, దీని ప్రకారం.. ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వ్యక్తి తన పాపాలన్నింటినీ పోగొట్టుకుని మోక్షాన్ని కూడా పొందుతాడు.
గరుడ పురాణం ప్రకారం కలియుగంలో గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షానికి ద్వారం తెరుచుకుంటుంది.
తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. గరుడ పురాణంలో తులసి ఒక ముఖ్యమైన భాగంగా వర్ణించబడింది. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే.. మరణానంతరం మోక్షం లభిస్తుంది. మరణం ఆసన్నం అయిన మనిషి నోట్లో తులసి నీరు పోయడం వలన ఆ వ్యక్తికి మోక్షానికి ద్వారాలు తెరుచుకుంటాయని కూడా నమ్ముతారు.
గరుడ పురాణం ప్రకారం.. మనిషి ఎల్లప్పుడూ శ్రీ హరి నామాన్ని జపించాలి. అలాగే జీవితాంతం నారాయణుడి పేరుని జపిస్తూ.. దశావతారాలను పూజిస్తే.. మోక్షం లభిస్తుంది. మరణించే ముందు నారాయణుడి పేరుని తలచినా చేసిన పాపాలు పోయి.. వైకుంఠం చేరుకుంటారని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు