
గరుడ పురాణం హిందూ మతంలో ప్రధాన గ్రంథం. దీనిలో మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలు మాత్రమే కాదు శరీరక, మానసిక ఆరోగ్యం గురించి ముఖ్యమైన సూచనలు కూడా ఇవ్వబడ్డాయి. ఈ గ్రంథం జీవితంలోని ప్రతి అంశంపై దృష్టి పెట్టింది. మనిషి శారీరక, మానసిక , ఆధ్యాత్మిక శ్రేయస్సుకు మార్గనిర్దేశం చేసింది. అందులో మహిళల ఋతుచక్రానికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఈ పురాణంలో చెప్పబడ్డాయి. ఇవి మహిళల శారీరక, మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
గరుడ పురాణం ప్రకారం ఋతుస్రావం అనేది స్త్రీలకు సహజమైన , అవసరమైన శారీరక ప్రక్రియగా పరిగణించబడుతుంది. ఇది మహిళల జీవిత చక్రంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మహిళలకు శారీరక, మానసిక విశ్రాంతి అవసరం. గరుడ పురాణం ప్రకారం మహిళలు తమ శారీరక అలసటను, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇది శరీరాన్ని తిరిగి శక్తివంతం చేసుకునే సమయం కనుక ఈ సమయంలో స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది.
ఈ కాలంలో మహిళలు ఎక్కువ పనిలో చేయకూడదని గరుడ పురాణం కూడా చెబుతోంది. దీనికి కారణం ఋతుస్రావం సమయంలో శరీరం, మనస్సు రెండింటిపై అదనపు ఒత్తిడి ఉంటుంది. కనుక ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ.. పనికి, పూజలు వంటి వాటికీ దూరంగా ఉండాలని నియమం పెట్టి ఉంటారు. ఈ సమయంలో మహిళలు స్వచ్ఛతను కాపాడుకోవాలని సూచించారు. తద్వారా శారీరక, మానసిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. స్వచ్ఛతతో పాటు, మానసిక శాంతి కూడా ముఖ్యం.. తద్వారా ఎలాంటి ఒత్తిడి ఉండదు. శరీర శక్తి సరైన దిశలో ఉంటుంది.
ఈ కాలంలో స్త్రీలు శారీరకంగా, మానసికంగా తమని తాము సరిగ్గా పునరుద్ధరించుకోగలిగేలా కొంతవరకు కుటుంబం, సమాజం నుంచి దూరంగా ఉంచాలని గరుడ పురాణం కూడా పేర్కొంది. అయితే ఈ సలహా సామాజిక ఒంటరితనం కోసం కాదు.. ఈ సమయంలో స్త్రీలు తీసుకోవాల్సిన విశ్రాంతి, మానసిక శాంతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియమం పెట్టబడింది.
ఈ సమయంలో మహిళలు పూజలు చేసి ఉపవాసం ఉంటే.. అది వారి శారీరక, మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఈ పురాణంలో ప్రస్తావించబడింది. పీరియడ్స్ ను ఒక బాధ్యతగా లేదా లోపంగా చూడకూడదు. దానిని సహజ ప్రక్రియగా అంగీకరించాలి.. తద్వారా మహిళలు ఆ సమయంలో గౌరవంగా, సుఖంగా ఉంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.