AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganga Pushkaralu 2023: మరికొద్ది గంటల్లో పవిత్ర గంగా పుష్కరాలు.. భారీ ఏర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వం..

గంగా పుష్కరాలు భారతీయులకు ఎంతో ప్రత్యేకం. తెలుగు ప్రజల కోసం కాశీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈనెల 29న వారణాసిలోని గంగా ఘాట్‌ దగ్గర జరిగే తెలుగు సంగమంలో ప్రధాని మోదీ పాల్గోనున్నారు. 

Ganga Pushkaralu 2023: మరికొద్ది గంటల్లో పవిత్ర గంగా పుష్కరాలు.. భారీ ఏర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వం..
Ganga Pushkaralu
Sanjay Kasula
|

Updated on: Apr 21, 2023 | 9:38 PM

Share

పవిత్ర గంగా పుష్కరాలు మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్నాయి. శనివారం నుంచి మే 3వరకు పన్నెండు రోజులపాటు జరగనున్నాయి సంబరాలు. గంగానది ప్రవహించే ప్రతిచోటా ఈ పుష్కరాలు జరుగుతాయి. అయితే, గంగోత్రి, రుషికేశ్‌, హరిద్వార్‌, వారణాసి, ప్రయాగరాజ్‌లో కన్నుల పండుగగా ఉత్సవాలు సాగుతాయి. గంగా పుష్కరాలు అంటే అందరికీ గుర్తొచ్చేది కాశీనే. భక్తులంతా కాశీ వెళ్లడానికే మొగ్గుచూపుతారు. ఇక్కడే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని భారతీయుల నమ్మకం. అంతేకాదు, గంగానదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భారతీయులు. గతించిన తమ ఆత్మీయులకు గంగా జలాల్లో పిండప్రదానం చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే, గంగా పుష్కరాలు భారతీయులకు ఎంతో ప్రత్యేకం. తెలుగు ప్రజల కోసం కాశీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈనెల 29న వారణాసిలోని గంగా ఘాట్‌ దగ్గర జరిగే తెలుగు సంగమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు.

పుష్కరం అంటే 12 సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ ‘పుష్కరాలు’ వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భారతీయులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నది పుష్కరంలో ఉన్నట్టే. పుష్కరకాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. ఈ జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించిందనేది సత్యం. జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించిందనేది చరిత్ర. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం సనాతన ధర్మంలో సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు, మంగళ స్నానాలు అని భారతీయ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది.

శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే. నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి.

నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

గంగా నది ప్రధాన పుష్కర్ ఘాట్ వాటి పేర్లు

1. వారణాసి 2. గంగోత్రి 3. హరిద్వార్ 4. బద్రీనాథ్ 5 .కేదార్నాథ్ 6. ప్రయాగ 7. అలహాబాద్

పవిత్ర గంగా స్నానం చేసేటపుడు త్రికరణ శుద్ధితో ఉండాలని పండితులు తెలిపిన మంచి మాట. ఆచారాలను భక్తితో నిర్వహించాలి. గంగానది సమీపంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం