గంగమ్మ ఒడికి గణపయ్యని చేర్చే సమయంలో పొరపాటునైనా ఈ తప్పులు చేశారా కష్టాలకు వెల్కం చెప్పినట్లే.. అవి ఏమిటంటే..

వినాయక చవితి నుంచి గణపతి ఉత్సవాలు మొదలు పెట్టి.. అనంత చతుర్దశి రోజున వినాయకుడిని నిమజ్జనం చేయడంతో ముగిస్తారు. ఈ పది రోజులు గణపతి బప్పా భూలోకంలో సంచరిస్తాడని.. తన భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. గణేష్ ఉత్సవాలు ముగింపుకి వచ్చేస్తున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు అనంత చతుర్దశి రోజున వైభవంగా గణపతి బప్పాకి వీడ్కోలు పలుకుతారు. ఈ రోజున విష్ణువు అనంతమైన రూపాన్ని పూజించడంతో పాటు. గణపతి నిమజ్జనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే వినాయక నిమజ్జనం చేసే సమయంలో తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయవద్దు. అవి ఏమిటంటే..

గంగమ్మ ఒడికి గణపయ్యని చేర్చే సమయంలో పొరపాటునైనా ఈ తప్పులు చేశారా కష్టాలకు వెల్కం చెప్పినట్లే.. అవి ఏమిటంటే..
Ganesh Nimajjanam

Updated on: Sep 03, 2025 | 3:15 PM

పంచాంగం ప్రకారం.. ఈసారి అనంత చతుర్దశి సెప్టెంబర్ 6న జరుపుకోనున్నారు. ఈ రోజున భక్తులు తమ ఇంటిలో ప్రతిష్టించి పూజించిన గణపతి విగ్రహాన్ని మాత్రమే కాదు మండపల్లోని వినాయకుడి విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తారు. పది రోజుల పాటు పూజలను చేసిన గణేశుడికి వీడ్కోలు పలకడం ఒక భావోద్వేగ క్షణం. అయితే ఈ వీడ్కోలును సరైన మార్గంలో చేయడం కూడా చాలా ముఖ్యం. నిమజ్జనం సమయంలో చిన్న చిన్న తప్పులు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. పాపం కలుగుతుందని నమ్మకం. కనుక గంగమ్మ ఒడికి గణపయ్యని చేర్చే సమయంలో పోరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో తెలుసుకుందాం.. ‘

నిమజ్జనం సమయంలో ఈ తప్పులు చేయకండి!

  1. నీటిని కలుషితం చేయవద్దు: గణపతి విగ్రహాలను నేరుగా నదుల్లో లేదా చెరువుల్లో నిమజ్జనం చేయవద్దు. ఈ రోజుల్లో పర్యావరణాన్ని కాపాడటానికి, కృత్రిమ ట్యాంకులలో లేదా ఇంట్లో నిమజ్జనం చేసే సంప్రదాయాన్ని అవలంబిస్తున్నారు. దీనివల్ల నీటి కాలుష్యం జరగదు.
  2. పగలని విగ్రహం : నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు విగ్రహం పగలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. విరిగిన విగ్రహాన్ని నిమజ్జనం చేయడం అశుభంగా పరిగణించబడుతుంది.
  3. అసంపూర్ణ ఆచారాలు: నిమజ్జనానికి ముందు గణేశునికి పూర్తి భక్తితో పూజ చేసి హారతి ఇవ్వండి. మోదకాలు, లడ్డూలు, పువ్వులు సమర్పించండి. ప్రసాదాన్ని భక్తులకు పంచి పెట్టండి. ఆ
  4. విగ్రహాన్ని నేరుగా నీటిలో వేయవద్దు: విగ్రహాన్ని నేరుగా నీటిలో పడవేయకూడదు. ముందుగా విగ్రహాన్ని నీటిలో మూడు సార్లు ముంచి అప్పుడు నెమ్మదిగా నీటిలో విగ్రహాన్ని విడిచి పెట్టండి.
  5. ఇవి కూడా చదవండి
  6. మత్తు పదార్థాలు సేవించి నిమజ్జనం చేయవద్దు: నిమజ్జనం రోజున మత్తు పదార్థాలను అస్సలు సేవించకూడదు. ఈ రోజున పూర్తిగా సాత్వికంగా ఉండి.. స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుడికి వీడ్కోలు పలకాలి.
  7. పూజా సామాగ్రిని విసిరేయకండి: పువ్వులు, దండలు, బట్టలు, కొబ్బరికాయ లేదా స్వీట్లు వంటి వాటిని నీటిలో వేయకండి. వాటిని శుభ్రమైన ప్రదేశంలో లేదా పవిత్ర మొక్క మొదలు ఈ పూజా సామగ్రిని పెట్టండి.
  8. నిమజ్జనం తర్వాత వెనక్కి తిరిగి చూడవద్దు: నిమజ్జనం తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని నమ్ముతారు. వచ్చే ఏడాది తిరిగి రమ్మనమని ఆహ్వానం పలుకుతూ గణపతికి వీడ్కోలు చెప్పండి.

గణపతి నిమజ్జన ప్రాముఖ్యత

అనంత చతుర్దశి రోజు పది రోజుల గణేష్ చతుర్థి వేడుక ముగింపును సూచిస్తుంది. ఈ రోజున చేసే నిమజ్జనం కేవలం విగ్రహాన్ని నిమజ్జనం చేయడమే కాదు, మన దుఃఖాలు, కష్టాలన్నింటినీ భగవంతుడు తీరుస్తాడని.. నమ్మకం. కనుక గణపతి నిమజ్జనం భక్తి, శ్రద్దలతో ఆచారాలు నియమాలతో చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆ ఇంటి సభ్యులపై బప్పా ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం.