పది రోజుల పాటు మండపాలలో ఇంటిలోని పూజా గదుల్లో పూజలను అందుకున్న బొజ్జ గణపయ్య నిమజ్జన కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా సాగుతోంది. చిన్న పెద్ద బుజ్జి గణపయ్యలు ఊరేగుతూ వచ్చి గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా పూల కడియపులంక లో వినూత్నంగా డ్రోన్తో బాలగణపతి విగ్రహ నిమజ్జనం నెట్టింట వైరల్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న బొజ్జ గణపయ్యను కొంతమంది చిన్నారులు ఇలా నిమ జ్జనం చేశారు. స్థానిక స్నానాలరేవు వద్దకు పిల్ల లను అనుమతించకపోవడంతో వారు ప్రత్యా మ్నాయాన్ని ఆలోచించారు.
తమ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి డ్రోన్ నిపుణుడి వివేక్ సాయాన్ని తీసుకున్నారు. విగ్రహాన్ని కాలువ మధ్యకు డ్రోన్ ద్వారా తీసుకెళ్లి నిమజ్జనం చేయడంతో పిల్లలు కేరింతలు కొట్టారు. డ్రోన్ ద్వారా బొజ్జ గణపయ్య రెండు నిమజ్జనం చేసే తంతును వింతగా చూశారు స్థానికులు, రైతు పంట పొలాల్లో పిచికారి చేసే ఈ డ్రోన్ ను బుజ్జి గణపయ్య ను ఊయలలో ఊరేగిస్తూ కాలువలో నిమజ్జనం చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు భక్తులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..