హిందువుల పండుగల సీజన్ కొనసాగుతోంది. జన్మాష్టమి తర్వాత.. ఇప్పుడు గణేష్ జన్మోత్సవంగా అత్యంత వైభవంగా జరుపుకునే వినాయకుడు చవితి కోసం వేచి చూస్తున్నారు. హిందూ మతంలో ప్రధాన పండుగల్లో వినాయక చవితి ఒకటి. 10 రోజుల పాటు జరుపుకోనున్న ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. అయితే గణేష్ చతుర్థి పండగ మహారాష్ట్రలో ప్రత్యేక ప్రాముఖ్యత కనిపిస్తుంది. గణపతి విగ్రహాల ఏర్పాటు కోసం మండపాలను రెడీ చేస్తున్నారు. గణపతి చతుర్థి సమయంలో మండపాల్లో కొలువుదీరే గణపతి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. గణేశుడిని 10 రోజుల పాటు గణపతి నవరాత్రులుగా ఆచారాల ప్రకారం పూజిస్తారు. 11 వ రోజున గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తారు.
గణపతి భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున జన్మించాడు. ఈ సంవత్సరం ఈ తేదీ సెప్టెంబర్ 18వ తేదీతో పాటు సెప్టెంబర్ 19 న వచ్చింది. దీంతో వినాయక చవితిని కొందరు సెప్టెంబర్ 18న జరుపుకోనుండగా.. మరికొందరు సెప్టెంబర్ 19 న జరుపుకోనున్నారు. సెప్టెంబర్ 28 న గణపతి నిమజ్జనం కార్యక్రమం జరగనుంది. గణేశ చతుర్థి రోజున విఘ్నాలకధిపతి గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. హృదయపూర్వకంగా నియమ నిబంధలనతో ఆరాధించడం ద్వారా గణపతి అనుగ్రహం పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో గణపతిని పూజించడానికి సరైన పూజా విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో వినాయక చవితి శుభ సమయం తెలుసుకుందాం..
పంచాంగం ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12.39 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8.43 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం గణేష్ చతుర్థి సెప్టెంబర్ 19 న జరుపుకోనున్నారు. గణేష్ పూజ జరుపుకోవడానికి శుభ సమయం 2 గంటల 27 నిమిషాలు.. ఈ సమయం ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 01:28 వరకు ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)