Ganesh Chaturthi 2023: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకూ గణపతికి ఈ నైవేద్యాలను సమర్పించండి.. శుభఫలితాలు మీ సొంతం..

|

Sep 11, 2023 | 8:36 AM

గణపతి నవరాత్రుల్లో వినాయకునికి సమర్పించే వస్తువులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గణేశునికి ఇష్టమైన వస్తువులను సమర్పించాలని విశ్వాసం. దీంతో వినాయకుడు సంతోషించి భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తాడు. గణేష్ ఉత్సవాల 10 రోజుల్లో 10 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ రోజు ఆ నైవేద్యాల గురించి తెలుసుకుందాం.. 

Ganesh Chaturthi 2023: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకూ గణపతికి ఈ నైవేద్యాలను సమర్పించండి.. శుభఫలితాలు మీ సొంతం..
Lord Ganesh Puja
Follow us on

ఆషాడ మాసం తొలి ఏకాదశి నుంచి హిందువులకు పండగ సీజన్ మొదలవుతుంది. ఇటీవలే జన్మాష్టమి జరుపుకున్న హిందువులు ఇప్పుడు వినాయక చవితి వేడుకలకు రెడీ అవుతున్నారు. హిందూ మతంలో  గణేశుడు విఘ్నలాధిపతి. మొదటిసారి పూజలను అందుకునే అర్హత కలిగి ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో, గణేష్ చతుర్థి పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వినాయక చవితిని గణపతి  జన్మోత్సవంగా జరుపుకుంటారు. గణేశుడు భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున జన్మించాడు. ఈ సంవత్సరం ఈ తేదీ సెప్టెంబర్ 19 న జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. అటువంటి పరిస్థితిలో గణపతి నవరాత్రులు సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రులను 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుతారు. 11 వ రోజు గణపతిని నిమజ్జనం చేస్తారు.

పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో  ఉదయతిథి ప్రకారం గణేష్ చతుర్థి పండుగను సెప్టెంబర్ 19 న జరుపుకుంటారు. ఈ రోజున పూజ శుభ సమయం ఉదయం 11.01 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 01.28 వరకు కొనసాగుతుంది. అంటే పూజ శుభ సమయం 2 గంటల 27 నిమిషాలు మాత్రమే ఉంది.

గణేష్ చతుర్థి ప్రాముఖ్యత

జ్ఞానం, ఆనందం, సుఖ సంతోష కారకుడైన గణేశుడిని పూజించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు లభిస్తుంది. గణేశ చతుర్థి రోజున ఏ భక్తుడైనా వినాయకుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే.. అతని కోరికలన్నీ నెరవేరుతాయని.. అతని జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సమయంలో గణేశుడు కైలాస పర్వతం నుండి వచ్చి 10 రోజులు భూమిపై ఉండి తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని గణపతి నవరాత్రులకు సంబంధించిన విశ్వాసం. అటువంటి పరిస్థితిలో నియమాల ప్రకారం గణేశుడిని పూజిస్తే అతని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

గణపతి నవరాత్రుల్లో వినాయకునికి సమర్పించే వస్తువులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గణేశునికి ఇష్టమైన వస్తువులను సమర్పించాలని విశ్వాసం. దీంతో వినాయకుడు సంతోషించి భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తాడు. గణేష్ ఉత్సవాల 10 రోజుల్లో 10 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ రోజు ఆ నైవేద్యాల గురించి తెలుసుకుందాం..

  1. ఉండ్రాళ్లు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనవి. అటువంటి పరిస్థితిలో వినాయక చవితి మొదటి రోజున అతనికి ఖచ్చితంగా ఉండ్రాళ్లను అందించండి.
  2. గణపతికి ఇష్టమైన వాటి జాబితాలో మోతీచూర్ లడ్డూ పేరు కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో రెండవ నైవేద్యంగా అందించండి.
  3. గణపతి నవరాత్రి మూడవ రోజున కుడుములను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  4. వినాయకుడికి కూడా అరటిపండు అంటే చాలా ఇష్టం. అటువంటి పరిస్థితిలో గణపతి నవరాత్రుల్లో నాల్గవ రోజున అరటిపండును సమర్పించండి.
  5. గణేష్ ఉత్సవ్ ఐదవ రోజున మఖానా ఖీర్ అందించండి.
  6. గణేష్ ఉత్సవాల ఆరవ రోజున, గణేశుడికి కొబ్బరికాయను సమర్పించండి.
  7. ఏడవ రోజు, గణేశుడికి డ్రై ఫ్రూట్స్ లడ్డూలను సమర్పించండి.
  8. గణేష్ జన్మోత్సవంలో ఎనిమిదో రోజు పూజ సమయంలో గణేశుడికి కొబ్బరి అన్నం కూడా సమర్పించవచ్చు. ఈ ప్రసాదం చేసేటప్పుడు కొబ్బరి పాలు తీసుకుని వాటితో అన్నం వండాలి. తీపి కోసం తేనె లేదా బెల్లం జోడించండి.
  9. అంతే కాదు గణపతికి శ్రీఖండ్ అంటే చాలా ఇష్టం. అటువంటి పరిస్థితిలో తొమ్మిదవ రోజున శ్రీఖండాన్ని సమర్పించండి.
  10. గణేష్ ఉత్సవం 10వ రోజున గణేశుడికి వివిధ రకాల మోదకాలను సమర్పించండి. దీంతో గణపతిని ప్రసన్నం అయ్యి కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)