Vastu Tips: విదేశీ ప్రయాణాలపై వాస్తు ప్రభావం.. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అంతా శుభం.

|

Jan 04, 2023 | 7:00 AM

విదేశీయానం, విదేశాలలో ఉద్యోగం, వ్యాపారం, విదేశాలలో స్థిరపడాలనుకోవడం వంటి విషయాలను వాయవ్య మూలను బట్టే నిర్ధారించవలసి ఉంటుంది. విదేశీ యోగానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురవుతుంటే వాస్తు పరంగా కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలు అతి త్వరగా పరిష్కారం అవుతాయి. సాధారణంగా విదేశాలకు వెళ్లడానికి..

Vastu Tips: విదేశీ ప్రయాణాలపై వాస్తు ప్రభావం.. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అంతా శుభం.
Vastu
Follow us on

విదేశీయానం, విదేశాలలో ఉద్యోగం, వ్యాపారం, విదేశాలలో స్థిరపడాలనుకోవడం వంటి విషయాలను వాయవ్య మూలను బట్టే నిర్ధారించవలసి ఉంటుంది. విదేశీ యోగానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురవుతుంటే వాస్తు పరంగా కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలు అతి త్వరగా పరిష్కారం అవుతాయి. సాధారణంగా విదేశాలకు వెళ్లడానికి రకరకాల కారణాలు ఉంటాయి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పర్యటనలు, యాత్రలు ఇందులో ముఖ్యమైనవి. ఇందులో ఏ కారణం అయినప్పటికీ ఇంట్లో చిన్న చిన్న మార్పుల ద్వారా ఈ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ప్రామాణిక వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.

విదేశీయానానికి సంబంధించినంత వరకు వాయవ్య దిశ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. వాయవ్య మూలలో గనుక ఏవైనా దోషాలు ఉన్నపక్షంలో విదేశీయానానికి ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇంట్లో వాయవ్య మూలలో బరువులున్నా, ఎత్తుగా ఉన్నా, కోత ఉన్నా, నీళ్ల ట్యాంకు ఉన్నా, పంపు ఉన్నా, నేల మాలిగ ఉన్నా వాయువ్యంలో దోషం ఉన్నట్టే భావించాల్సి ఉంటుంది. అటువంటివి ఉంటే విదేశీయానానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ మూలలో అక్కరలేని వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే తీసేయడం మంచిది. అవి తీసేసిన తరువాతే వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశీయానానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.

వాయవ్యం వైపు తలపెట్టి పడుకున్నా కూడా విదేశీయానానికి అవకాశాలు మెరుగుపడతాయి. విదేశీ సంబంధమైన అవకాశాలకు ఏవైనా సమస్యలు ఎదురైతే నాలుగైదు రోజులపాటు వాయవ్య దిశగా తలపెట్టి పడుకుంటే విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. అంతేకాదు, విదేశాలకు వెళ్లదలుచుకున్నప్పుడు మీరు అక్కడికి తీసుకువెళ్లే ముఖ్యమైన వస్తువులను వాయవ్య మూలలోనే ఉంచడం వల్ల ఉపయోగం ఉంటుంది. దీనివల్ల అతి తక్కువ కాలంలోనే మీ కోరిక నెరవేరుతుంది. ఉన్నత విద్య, సంపాదన వంటి కోరికలతో విదేశాలకు వెళ్లదలచుకుంటే వాయవ్యంతోపాటు ఉత్తర దిశను కూడా ఏ దోషమూ లేకుండా జాగ్రత్త పడటం మంచిది. ఉత్తర దిశలో ఒక చిన్న ఫౌంటెన్ ను గానీ, ఎక్వేరియం ను గానీ ఏర్పాటు చేస్తే మీరు విదేశాలకు వెళ్లడం అనేది త్వరగా జరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇతర దిక్కులకు ప్రాధాన్యం

పరిశోధన, పురస్కారాలు, గౌరవాలు, సత్కారాలు వగైరాల కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తే వాయువ్యంతో పాటు తూర్పు దిక్కుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. తూర్పు దిక్కును ఏ విధంగానూ మూసేయకూడదు. దాన్ని అన్నివేళలా తెరిచే ఉంచాలి. అంటే ఆ వైపున ఉన్న కిటికీలను, తలుపులను మూయకుండా ఉంచితే శుభకరమైన ఎనర్జీ లోపలికి ప్రవేశిస్తుంది. మీ డ్రాయింగ్ రూమ్ లో కానీ లేదా పర్సనల్ రూమ్ లో కానీ, ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ రూమ్ లో కానీ తూర్పు దిశలో ఒక కంచు సూర్యుడి బొమ్మను ఏర్పాటు చేయడం వల్ల మీకు విదేశాల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతాయి.

సరదా కోసమో, పర్యాటకం కోసమో, బంధువులను చూడటం కోసమో, తాత్కాలిక సందర్శన కోసమో విదేశాలకు వెళ్లదలచుకుంటే, వాయవ్యం తోపాటు ఆగ్నేయ మూలను కూడా తెరచి ఉండటం మంచిది. ఆ సమయంలో ఆగ్నేయంలో కూడా బరువులు, అక్కర లేని వస్తువులు, చెత్త, విరిగిన వస్తువులు వగైరాలను ఉంచకూడదు. ఏవైనా చెక్క బొమ్మలతో ఆ ప్రదేశాన్ని అలంకరించడం మంచిది. విదేశాలలో ఉన్న కుటుంబ సభ్యులతో కొంతకాలం గడపడానికి వెళుతుంటే వాయువ్యంతో పాటు ఈశాన్యం మూలను కూడా దోషరహితంగా ఉంచాల్సి ఉంటుంది. ఉత్తర దిశలో కానీ, తూర్పు దిశలో కానీ ఏదైనా తీవ్రస్థాయి దోషం ఉంటే ఆ ఇంట్లోని వ్యక్తులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనను విరమించుకోవడం మంచిది. వారు విదేశీ ప్రయాణాలకు సిద్ధపడితే భారీగా డబ్బు నష్టం, ఆరోగ్య నష్టం జరిగే అవకాశం ఉంది. ఒక్కోసారి జీవితం కూడా దెబ్బ తినవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..