Vastu Tips: రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయండి.. మీ ఇంట్లో ఆర్థికంగా లోటు ఉండదు.

ఇక కేవలం ఇంటి నిర్మాణ విషయంలోనే కాకుండా ఇంట్లో ఉండే పరిస్థితులపై కూడా వాస్తు ప్రభావం ఉంటుంది. కొన్ని తెలిసీ తెలియక చేసే తప్పులు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంట్లో మనం చేసే తప్పులు ఆర్థికంగా, మానసికంగా కుటుంబ సభ్యులపై దుష్ఫ్రభావాన్ని చూపుతాయి. అలాంటి దోషాల నుంచి బయటపడడానికి కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించాలి. ఇలాంటి వాటిలో ఒకటి. రాత్రి పూట్‌ పడుకునే ముందు పాటించే కొన్ని వాస్తు చిట్కాలు...

Vastu Tips: రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయండి.. మీ ఇంట్లో ఆర్థికంగా లోటు ఉండదు.
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 07, 2023 | 5:49 PM

ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలపై, ఆర్థిక స్థితిగతులపై వాస్తు ప్రభావం ఉంటుందని మనలో చాలా మంది విశ్వసిస్తుంటారు. మరీ ముఖ్యంగా భారతీయులను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి. అందుకే చాలా మంది వాస్తును తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఇంటి పునాది నుంచి మొత్తం నిర్మాణం పూర్తయ్యేక వరకు పక్కాగా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు.

ఇక కేవలం ఇంటి నిర్మాణ విషయంలోనే కాకుండా ఇంట్లో ఉండే పరిస్థితులపై కూడా వాస్తు ప్రభావం ఉంటుంది. కొన్ని తెలిసీ తెలియక చేసే తప్పులు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంట్లో మనం చేసే తప్పులు ఆర్థికంగా, మానసికంగా కుటుంబ సభ్యులపై దుష్ఫ్రభావాన్ని చూపుతాయి. అలాంటి దోషాల నుంచి బయటపడడానికి కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించాలి. ఇలాంటి వాటిలో ఒకటి. రాత్రి పూట్‌ పడుకునే ముందు పాటించే కొన్ని వాస్తు చిట్కాలు. రాత్రి నిద్రపోయే ముందు కొన్ని రకాల పనులు చేస్తే ఇంట్లో ఆర్థికంగా ఢోకా ఉండదు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. ఇంతకీ రాత్రి పడుకునే ముందు చేయాల్సిన ఆ పనులు ఏంటంటే..

* రాత్రి పడుకునే ముందు వీలైతే కాళ్లు, చేతులు కడుక్కొని పూజ గదిలో దీపం వెలిగించాలి. ఒకవేళ నాన్‌ వెజ్‌ తీసుకుంటే మాత్రం దీపం వెలిగించకూడదు. ఇక ఇంట్లో పూజ గది ఎప్పుడు చీకటిగా ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. నిత్యం వెలుగుతూ ఉండేలా లైట్‌ ఆన్‌లోనే ఉంచాలి.

* రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో కర్పూరాన్ని కాల్చితే ఇంట్లో పాజిటివ్‌ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇలా చేయడం వల్ల నెగెటివ్‌ ఎనర్జీ దూరమవుతుంది. లక్ష్మీదేవీ అనుగ్రహం లభిస్తుంది. రాత్రి కర్పూరం కాల్చి.. పొగను పడకగదిలో, ఇంటి మొత్తం వేయాలి.

* రాత్రి పడుకునే ముందు ఇంటికి దక్షిణం వైపు ఆవనూనె దీపాన్ని వెలిగించాలి. పూర్వీకులు ఈ దిశలో ఉంటారని చెబుతుంటారు. ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల మంచి జరుగుతుంది. దీపం వెలిగించడం వీలులేకపోతే ఈ దిశలో చిన్న బల్బునైనా వెలిగించాలి.

* ఇక రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లక్ష్మీదేవీ ఇంట్లోకి ప్రధాన ద్వారంగుండానే ప్రవేశిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఈ దిశలో చెప్పులు, బూట్లూ వంటివి లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* వాస్తు శాస్త్ర ప్రకారం.. ఇంట్లో ఈశాన్యం, ఉత్తర దిక్కులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ దిక్కులు కుబేరుడి దిక్కుగా భావిస్తుంటారు. అందుకే రాత్రి పడుకునే ముందు ఈశాన్యం, ఉత్తర దిక్కులు శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే