
ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే.. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. మరీ ముఖ్యంగా భారతీయులను, వాస్తు నమ్మకాలను విడదీసి చూడలేం. అంతలా వాస్తును విశ్వసిస్తుంటారు. అందుకే ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు.
ఇంటి పునాది మొదలు గదుల నిర్మాణం వరకు అన్నింటిలో వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. అయితే వాస్తు కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాకుండా, ఇంట్లో కొన్ని రకాల వాస్తు దోషాల వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే.. కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంట్లో గొడవలు తగ్గాలన్నా, మానసిక ప్రశాంతత లభించాలన్నా కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..
ఇంట్లో గొడవలు నిత్యం జరుగుతుంటే ప్రతి గదిలోనూ మూలలో రాక్ స్టాల్‌ను ఉంచాలి. గది మూలలో దొడ్డు ఉప్పును ఒక నెల రోజుల పాటు ఉంచితే ప్రతికూల శక్తులు ఏవైనా ఉంటే తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సాల్ట్‌ను నెల రోజుల తర్వాత మళ్లీ రాక్ సాల్ట్‌ను మార్చుతూ ఉండాలి. ఇలా నిత్యం చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు దూరమవుతాయి. ఇక వాస్తు ప్రకారం లేని బాత్ రూమ్‌లో కూడా ఓ మూలన రాక్ సాల్ట్‌ను ఉంచితే వాస్తు దోషాన్ని తగ్గించుకోవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇక ఇంట్లో దుమ్ము, దూళి, మురికిగా ఉన్నా ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు మురికిగా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయి. అందుకే ఇల్లు ఎప్పుడు కచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో మూలలు దుమ్ము, ధూళి, చిందర వందరంగా వస్తువులు ఉండకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉంటే ఇంట్లో చిరాకు ఉంటుంది. ఇక పూర్వీకుల ఫొటోలను ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా.. నైరుతి దిశలోనే ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంట్లో చిరాకు తగ్గి, గొడవలు సమసిపోవాలంటే.. వాటర్ ఫౌంటెన్, బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. ఇలా చేస్తే ప్రశాంతత లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..